‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

  • August 16, 2023 / 12:13 PM IST

సినీ పరిశ్రమలో ఉండే జనాలు సెంటిమెంట్లకి పెద్ద పీట వేస్తుంటారు. ఓ ప్రయత్నం సక్సెస్ అయితే మళ్ళీ మళ్ళీ.. అదే ప్రయత్నాలకు పూనుకుంటారు. అలా కాకుండా ఓ ప్రయత్నం విఫలమైందంటే మళ్ళీ దాని జోలికి పోరు. ఇలా ఒక్కటేంటి.. కొబ్బరి కాయ కొట్టే ముహూర్తం నుండి గుమ్మడి కాయ కొట్టే వరకు ఎన్నో సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. నెగిటివ్ సెంటిమెంట్ కనుక ఉంటే .. మేకర్స్ సరిగ్గా పనిచేయలేరు అనేది వారి నమ్మకం. హీరో, హీరోయిన్, రిలీజ్ డేట్ .. ఇలా చాలా సెంటిమెంట్లు ఉంటాయి దర్శకనిర్మాతలకు.

అలాగే ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది. ఒకసారి ఓ జోనర్ లేదా ఓ బ్యాక్ డ్రాప్ సినిమా హిట్ అయ్యింది అంటే ! అదే బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయడానికి ఫిలిం మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాగే కోల్‌కతా మహా నగరం తెలుగు సినిమాలకి బాగా కలిసొస్తుంది అనేది కొందరి నమ్మకం. ఒకటి కాదు రెండు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి అంటే మన వాళ్ళకి.. ఆ మహా నగరం పై ఎంత పాజిటివ్ సెంటిమెంట్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు ఏంటో..! అందులో ఎన్ని హిట్ అయ్యాయో? ఎన్ని ఫ్లాప్ అయ్యాయో తెలుసుకుందాం రండి :

1) చూడాలని ఉంది :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘చూడాలని ఉంది’ చిత్రాన్ని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. 1998 లో వచ్చిన ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.ఈ కథ మొత్తం టాలీవుడ్లో ఈ మూవీ ఓ గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు. స్టార్ హీరోతో ఇలాంటి సున్నితమైన కథ చేస్తే సక్సెస్ అవుతుందా.. అది కూడా క్లాస్ టైటిల్ తో అనే అనుమానాలు చాలా .. రిలీజ్ కి ముందు వ్యక్తమయ్యాయి. అయితే ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

2) ఖుషి :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2001 లో రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. రీ రిలీజ్ అయినా కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను సాధించింది. ఇది కూడా కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మూవీనే..!

3) లక్ష్మీ :

విక్టరీ వెంకటేష్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2006 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది.

4) ఓయ్ :

సిద్దార్థ్, షామిలి నటించిన ఈ మూవీ కూడా కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. అయితే ఈ సినిమా యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

5) పంజా :

పవన్ కళ్యాణ్ హీరోగా విష్ణు వర్ధన్ కాంబినేషన్లో రూపొందిన ఈ గ్యాంగ్స్టర్ మూవీ కూడా కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

6) ఉల్లాసంగా ఉత్సాహంగా :

ఈ సినిమా సెకండ్ హాఫ్ చాలా వరకు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. కరుణాకరణ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

7) అదుర్స్ :

ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ మూవీ కూడా కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. వినాయక్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

8) నాయక్ :

రాంచరణ్ డబుల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీకి కూడా వినాయక్ దర్శకుడు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మూవీ ఇది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

9) పవర్ :

రవితేజ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

10) పడి పడి లేచె మనసు :

శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

11) పెద్దన్న :

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘సిరుతై’ శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. ఈ సినిమా తెలుగులో డిజాస్టర్ అయ్యింది.

12) శ్యామ్ సింగ రాయ్ :

నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందింది.ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

13) భోళా శంకర్ :

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags