Rajinikanth: ఆ వ్యసనం కారణంగా కోట్ల రూపాయలు పోగొట్టుకున్న రజినీ!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికి 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన భారీగా ఆస్తులు సంపాదించే ఉంటారని చెప్పాలి. ఇలా పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించినటువంటి ఈయన తన ఆస్తిలో చాలా వరకు ఓ చెడు వ్యసనం కారణంగా పోగొట్టుకున్నారట.

తాజాగా జైలర్ సినిమాలో నటించినందుకు ప్రొడ్యూసర్ కళానిధి మారన్ ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా రజినీకాంత్ కు అదనంగా మరికొంత రెమ్యూనరేషన్ ఇవ్వడమే కాకుండా తనకు కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఈ కారులో సక్సెస్ మీట్ కార్యక్రమానికి వచ్చినటువంటి రజనీకాంత్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ నేను చాలా రోజుల తర్వాత ధనవంతుడు అయ్యాను అన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది అంటూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా రజనీకాంత్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. రజనీకాంత్ ఎప్పటినుంచో ధనవంతుడు కదా కొత్తగా ఇప్పుడు ధనవంతుడు కావడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోయారు అయితే రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం జూదం ఆడే వ్యసనం కారణంగా భారీగా పోగొట్టుకున్నారని తెలుస్తుంది.

ఈయనకు జూదం ఆడే అలవాటు ఉండటం చేత పెద్ద ఎత్తున ఈ ఆట ఆడుతూ అప్పట్లోనే భారీ స్థాయిలో ఆస్తులు పోగొట్టుకున్నారని అప్పుడు ఈయన పోగొట్టుకున్న ఆస్తులు విలువ ఇప్పుడుతో కనుక పోలిస్తే సుమారు 100 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. ఇలా ఈ వ్యసనం కారణంగానే రజినీకాంత్ భారీ స్థాయిలో ఆస్తులు కోల్పోవడంతో ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. అయితే ఇప్పటికైనా రజనీకాంత్ డబ్బు విషయంలో కాస్త జాగ్రత్త పడితే బాగుంటుంది అంటూ ఈ విషయం తెలిసిన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus