దక్షిణ భారతదేశంలోనే అత్యంత చిన్న ఇండస్ట్రీలో ఇన్ని లొసుగులా?

సినిమా ఇండస్ట్రీలో చీకటి కోణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీరెడ్డి (Sre పుణ్యమా అని అన్నీ ఇండస్ట్రీలు ఒక్కసారిగా లుంగీలు సర్దుకున్నాయి. అయితే.. మలయాళం సినిమా ఇండస్ట్రీ విషయంలో మాత్రం దిలీప్ కుమార్ & భావన మధ్య జరిగిన ఇన్సిడెంట్ యావత్ భారదేశాన్ని కుదిపేసింది. సినిమాల్లో చూసే కిడ్నాప్ & బలవంతపు చర్యలు నిజజీవితంలోనూ.. అది కూడా సినిమా ఇండస్ట్రీలో జరుగుతాయని తెలియజెప్పిన ఏకైక చిత్రసీమ మలయాళ ఇండస్ట్రీ. భావన ఉదంతం తర్వాత అక్కడి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇండస్ట్రీలోని లోటుపాట్లను రిపోర్ట్ చేయమని తీర్మానించింది.

అలా ఏర్పాటైన ఒక కమిటీనే “హేమ కమిటీ”. ముగ్గురు సభ్యుల బృందం దాదాపుగా అన్ని సినిమాకి సంబంధించిన అన్ని శాఖలవారిని ఇన్వెస్టిగేట్ చేసి.. ఇండస్ట్రీలో అమ్మాయిలు/మహిళలు ఎదుర్కొనే సమస్యలపై 235 పేజీల రిపోర్ట్ ను నేను సబ్మిట్ చేసింది. ప్రస్తుతం ఆ రిపోర్ట్ మలయాళ ఇండస్ట్రీలో పెను దుమారం రేపుతోంది. దాదాపుగా 30 డిపార్టుమెంట్లకు సంబంధించిన మహిళలతో మాట్లాడి/ఇన్వెస్టిగేట్ చేసి హేమ కమిటీ సబ్మిట్ చేసిన రిపోర్ట్ లో మహిళలతోపాటు మగవాళ్లు కూడా ఇండస్ట్రీ నుండి చెప్పుకోలేని సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

క్యాస్టింగ్ కౌచ్ కంటే.. ఇల్లీగల్ బ్యానింగ్ అనేది ఎవ్వరూ చెప్పుకోలేని నిరాధారమైన పెనుభూతమని, దానివల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయని ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. మలయాళ ఇండస్ట్రీలో బాగా పవర్ ఫుల్ అయిన కొందరు హీరోలు, దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మరియు ఫైనాన్షియర్లు కలిసి ఒక సిండికేట్ గా ఫార్మ్ అయ్యి.. తమకు శారీరకంగా సహకరించని హీరోయిన్లను అలాగే.. తమను ఎదిరించే టెక్నీషియన్లను ఇల్లీగల్ గా బ్యాన్ చేస్తూ వారికి అవకాశాలు రాకుండా చేస్తూ..

రాక్షశానందం పొందుతున్నారని ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇక మహిళలకు సెట్లో కనీస వసతులైన బాత్రూంలు అందుబాటులోకి లేకపోవడం మొదలుకొని కమిట్మెంట్ అంటూ ఇండస్ట్రీలోని మగాళ్లు చేసే వికృత చేష్టల వరకు ప్రతీ విషయాన్ని చాలా కులంకుశంగా పొందుపరచడం జరిగింది. 235 పేజీల ఈ రిపోర్ట్ లో ఎవరి పేరు ప్రస్తావించలేదు. అయితే.. ఈ రిపోర్ట్ ను పబ్లిక్ చేయడానికి ముందు రిపోర్ట్ లోని దాదాపు 60కి పైగా పేజీలను డిలీట్ చేయించారని తెలుస్తోంది. మరి అలా చేయించింది ఎవరు? ఆ 60 పేజీల్లో ఏముంది? అనేది ఎప్పటికైనా బయటకొస్తుందా లేక తొక్కేస్తారా? అనేది చూడాలి.

Click Here For The Report

అన్నయ్య అలా సర్ప్రైజ్ చేస్తే ఇష్టం.. సితార చెప్పిన విషయాలివే!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus