సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే యాడ్స్ లో నటించిన సితార సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు. రాబోయే రోజుల్లో సితార స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సితార చిన్న వయస్సులోనే సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. రాఖీ పండగ సందర్భంగా సితార వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మా ఇంట్లో చిన్న పూజతో రాఖీ పండుగ ప్రారంభం అవుతుందని గౌతమ్ (Sitara, Gautam) అన్నయ్యకు రాఖీ కట్టి ఇద్దరం బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటామని సితార తెలిపారు.
ప్రస్తుతం సితార వయసు 12 సంవత్సరాలు కాగా 9 ఏళ్ల వయసులో రాఖీ పండుగకు అసలైన అర్థం తెలిసిందని పేర్కొన్నారు. చేతికి రాఖీ కట్టడం అనేది ఆచారం అని ఆ ఆచారాన్ని పాటించాలని సితార కామెంట్లు చేశారు. బాల్యంలో నాకు అంతవరకు మాత్రమే తెలుసని సితార పేర్కొన్నారు. తర్వాత రోజుల్లో మాత్రం సోదరుడితో అనుబంధం ముఖ్యమని అది సూచించి కట్టే రాఖీకి చాలా ప్రాధాన్యత ఉంటుందని ఈ పండుగ యొక్క అసలు విషయం తెలిసిందని సితార పేర్కొన్నారు.
రాఖీ పండగ నేను ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పండుగలలో ఒకటని సితార చెప్పుకొచ్చారు. 2024 సంవత్సరం నాకు చాలా స్పెషల్ అని సితార అన్నారు ఈ సంవత్సరం గౌతమ్ అన్నయ్య చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నాడని అన్నయ్య దూరంగా ఉండటం అనే మార్పు స్పష్టంగా కనిపిస్తోందని సితార కామెంట్ చేశారు. పండగ సమయంలో రాఖీ కొనుగోలు చేయడం ఎంతో పెద్ద పని అని ఒక పట్టాన నేను రాఖీని ఎంపిక చేయలేనని రాఖీ కొనుగోలు చేయడానికి సమయం పడుతుందని మా అన్నయ్య మనస్తత్వానికి దగ్గరగా ఉండే రాఖీ కొనుగోలు చేస్తానని సితార అన్నారు.
పండుగ సమయంలో అమ్మ నమ్రత తన వంతు సలహాలు, సూచనలు ఇస్తుందని రాఖీ పండగ సమయంలో ఈ గైడెన్స్ మరింత ఎక్కువగా ఉంటుందని సితార అన్నారు. అమ్మకు సాంప్రదాయాలు పాటించడం అంటే ఎంతో ఇష్టమని అమ్మ ఒత్తిడి చేయకుండానే సాంప్రదాయాలను పాటించాలని చెబుతారని పేర్కొన్నారు. గౌతమ్ అన్నయ్య నాకు ఫలానా బహుమతి ఇవ్వాలని నేను అనుకోనని కానీ అన్నయ్య బహుమతులతో సర్ప్రైజ్ చేస్తే నాకు ఇష్టమని సితార తెలిపారు. అన్నయ్య నా గురించి ఆలోచిస్తున్నాడని చెప్పే ఏ బహుమతి అయినా నాకు ఓకే అని సితార అభిప్రాయపడ్డారు.