Indra Re-release: ఆ కారణాల వల్లే ఇంద్ర మేకర్స్ నిర్ణయంలో మార్పు.. ఏమైందంటే?

టాలీవుడ్ సినీ చరిత్రలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాలలో ఇంద్ర (Indra)  సినిమా ఒకటి. ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగా సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి  (Chiranjeevi)  సినీ కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో ఒకటి. ఈ సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్స్ కు సైతం ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా ఈ నెల 22వ తేదీన థియేటర్లలో రీరిలీజ్ కానుంది.

Indra Re-release

మొదట ఇండిపెండెన్స్ డే కానుకగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ కావడంతో ఇంద్ర మేకర్స్ రీరిలీజ్ విషయంలో పునరాలోచించారు. అయితే ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు భారీ హిట్లుగా నిలిచే పరిస్థితి లేకపోవడంతో ఇంద్ర రీరిలీజ్ దిశగా అడుగులు పడుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కేవలం 20 గంటల్లో ఈ సినిమాకు సంబంధించి 12,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని భోగట్టా.

కేవలం హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు ఇప్పటికే 45 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వచ్చాయని సమాచారం అందుతోంది. రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇంద్ర మూవీ రీరిలీజ్ లో గత సినిమాల రీరిలీజ్ రికార్డ్స్ ను సైతం బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఇంద్ర రీరిలీజ్ కలెక్షన్లు ఆ రేంజ్ లో ఉంటాయో లేదో చూడాలి.

అదే రోజు శంకర్ దాదా ఎంబీబీఎస్  (Shankar Dada M.B.B.S) సినిమా కూడా రీరిలీజ్ అవుతుండటంతో చిరంజీవి సినిమాతో చిరంజీవి సినిమానే బాక్సాఫీస్ వద్ద పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు సినిమాలలో ఏ సినిమా కూడా వెనక్కు తగ్గే పరిస్థితి అయితే లేదు. మరోవైపు చిరంజీవి పుట్టినరోజున విశ్వంభర (Vishwambhara) మూవీ అప్ డేట్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. చిరంజీవి పుట్టినరోజును అభిమానులు పండగ రోజులా జరుపుకోనున్నారు.

స్టార్ హీరో బాలయ్య మనస్సు బంగారం అంటున్న అభిమానులు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus