అతిలోక సుందరి శ్రీదేవి- నిర్మాత బోనీ కపూర్ ల ముద్దుల కూతురు గా బాలీవుడ్లోకి అరంగేట్రం చేసింది జాన్వీ కపూర్. బ్యాక్ గ్రౌండ్ ఎంట్రీ ఇచ్చినా.. ఈ బ్యూటీ అనతికాలంలోనే సొంత గుర్తింపు తెచ్చుకుంది. మిగతా స్టార్ కిడ్స్తో పోలిస్తే.. జాన్వీ కెరీర్ గ్రాఫ్ చాలా డిఫరెంట్గా.. కాస్త బెటర్ సక్సెస్ కనిపిస్తుంది. ఈ భామ డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ తనలోని నటిని మేగురు పరుచుకునే పనిలో పడింది. సినిమా సక్సెస్.. ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ బీ టౌన్లో సత్తా చాటుతోంది.
మరోవైపు తనకు ఫేవరెట్ అయిన టాలీవుడ్లోనూ ఎంట్రీకి సాలిడ్ ప్లాన్ చేసింది. అందులో భాగంగానే ఈ భామ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్లో కూడా పాల్గొంది. మరోవైపు ఈ భామ బీ టౌన్లోనూ ఐదారు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవలే బవాల్ అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది.
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్తో కలిసి జాన్వీ బవాల్ సినిమాలో రొమాన్స్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్లో ఈ జంట కనులవిందుగా కనిపిస్తోందని బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఫొటోషూట్స్ కూడా చేసింది ఈ జంట. అయితే తాజాగా చేసిన ఫొటోషూట్ మాత్రం బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ ఫొటోలు చూసిన టాలీవుడ్ యువత తెగ ఫీల్ అయిపోతోంది. దానికి కారణం ఈ ఫొటోషూట్లో జాన్వీ వరుణ్తో ఘాటుగా పోజులివ్వడమే. ప్రస్తుతం ఈ ఇద్దరి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో జాన్వీ (Janhvi Kapoor) చేసే రచ్చ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ ఇలా సినిమా ప్రమోషన్స్ పేరుతో ఘాటు పోజులివ్వడమేంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అది కూడా ఓ పెళ్లైన హీరోతో ఏంటని ట్రోల్ చేస్తున్నారు. వరుణ్ ఒళ్లో కూర్చొని దిగిన ఫొటోలను జాన్వీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో బీ టౌన్లో హీట్ పుట్టింది. ఇక బవాల్ సినిమా స్క్రీనింగ్లోనూ జాన్వీ తనదైన స్టైల్లో డ్రెస్సింగ్తో అందరినీ ఆకర్షించింది. సినిమా జులై 21న రిలీజ్ కానుంది.
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు