సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !

  • July 15, 2023 / 01:52 PM IST

ఆడదాని వయసు.. మగాడి సంపాదన ఎవరికీ చెప్పకూడదని అంటారు. ఇది ఎవరు ఫాలో అయినా లేకపోయినా టీవీ, సినిమా ఇండస్ట్రీలో వాళ్లు మాత్రం తప్పక ఫాలో అవుతారు. విచిత్రం ఏంటంటే వాళ్లు.. వయసు, సంపాదన రెండూ చెప్పరు. మనం వెతుక్కోవడమే. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు పొలిటికల్ మీటింగ్‌లలో పొరపాటున వాళ్ల రెమ్యూనరేషన్ గురించి చెప్పి ఉండొచ్చు కానీ.. చాలామంది ఈ రెమ్యూనరేషన్‌ని రహస్యంగానే ఉంచుతారు. కాబట్టి ఈ రెమ్యూనరేషన్స్‌పై గాసిప్ నడుస్తుంటాయి. అలా టాప్ సీరియల్ యాక్టర్స్ (Actors) రెమ్యూనరేషన్స్‌పై ఓ లుక్కేద్దాం.

వంటలక్క (ప్రేమి విశ్వనాథ్)

కార్తీకదీపం సీరియల్‌తో జాతీయ స్థాయిలో పేరొందిన వంటలక్క తన అద్భుత నటనతో కార్తీకదీపం సీరియల్‌ని పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది. ఇక రెమ్యూనరేషన్‌లో ఈమె ఒక్క రోజు షూటింగ్‌కి రూ.40 వేలు హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుందట. అయితే ఇప్పుడు కార్తీకదీపం హవా తగ్గిపోవడంతో.. వంటలక్క రెమ్యూనరేషన్ సగానికి తగ్గించేసిందనే టాక్ నడుస్తోంది.

జ్ఞానాంబ (రాశి)

సీనియర్ నటి రాశి ఒకప్పుడు టాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన అందాల రాశి.. ఇప్పుడు జానకి కలగనలేదు సీరియల్‌లో రామాకి తల్లిగా.. జానకికి అత్తగా జ్ఞానాంబ పాత్రలో నటిస్తోంది. ఈమె రెమ్యూనరేషన్ 25,000 పైమాటే. తన సీనియారిటీ తగ్గట్టుగానే రాశికి రెమ్యూనరేషన్ అందిస్తున్నారు.

తులసి (కస్తూరి శంకర్)

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో తులసిగా నటిస్తున్న కస్తూరి శంకర్.. తన క్రేజ్‌‌కి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ అందుకుంటుంది. సీనియర్ హీరోయిన్ రాశి మాదిరిగానే కస్తూరి కూడా ఒక్కరోజుకి రూ.25 వేలు అందుకుంటుందట. ఇక వెబ్ సిరీస్, సినిమా షూటింగ్స్ అయితే దీనికి రెట్టింపు అట. అంటే డేకి యాభై వేలకు పైగానే డిమాండ్ చేస్తుందట కస్తూరి.

జానకి.. (ప్రియాంక జైన్ )

మౌనరాగం సీరియల్‌తో యూత్‌ని సైతం సీరియల్స్ చూసేట్టు చేసింది అమ్ములు (ప్రియాంక జైన్). ఇప్పుడు ‘జానకి కలగనలేదు సీరియల్‌లో జానకి ఐపీఎస్‌గా అలరిస్తుంది జానకి.. రెమ్యూనరేషన్ ఈమె ఒక్క రోజుకి గానూ.. రూ.20 వేల రెమ్యూనరేషన్ అందుకుంటుందట.

కీర్తి కేశవ్

మనసిచ్చి చూడు సీరియల్‌తో పాపులర్ అయిన కీర్తి.. బిగ్ బాస్ షోతో తెలుగు ఆడియన్స్‌కి బాగా చేరువైంది. ప్రస్తుతం ‘మధురానగరిలో’ అనే సీరియల్‌లో నటిస్తుంది.. ఈమె కూడా రెమ్యూనరేషన్ ఒక్కరోజుకి గానూ రూ.20-25 వేలు అందుకుంటుందని టాక్. ఇక ఇతర టీవీ షోలు.. స్పెషల్ ఈవెంట్‌లు అయితే స్పెషల్ రేటు. డేకి లక్షకి పైగానే డిమాండ్ చేస్తుందట కీర్తి.

వసుధార (రక్షా గౌడ)

గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధారగా అలరిస్తున్న రక్షా గౌడ తన నటనతో కుర్ర హృదయాలను కొల్లగొట్టేసింది. రిషితో వసు క్యూట్ లవ్ స్టోరీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ కావడంతో.. ‘గుప్పెడంత మనసు’ సీరియల్ అతి తక్కువ కాలంలోనే రేటింగ్ పట్టికలో టాప్‌కి చేరింది. దీంతో వసుధార రెమ్యూనరేషన్ కూడా క్రేజ్‌కి తగ్గట్టే తీసుకుంటున్నట్టు టాక్. ఒక్క రోజుకి గానూ.. సీనియర్ హీరోయిన్లతో సమానంగా రూ.15 వేలు అందుకుంటుందట.

కావ్య (దీపికా రంగరాజు)

‘బ్రహ్మముడి’ సీరియల్ ప్రస్తుతం రేటింగ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంది. ఈ సీరియల్‌లో కావ్యగా నటిస్తున్న దీపికా రంగరాజు రెమ్యూనరేషన్ కూడా రూ.15 వేలు పైమాటే.

మోనిత (శోభాశెట్టి)

కార్తీదీపం సీరియల్‌లో మోనితగా అల్లాడించిన శోభాశెట్టి.. రెమ్యూనరేషన్ విషయంలోనూ టీవీ సీరియల్స్ హీరోయిన్స్‌కి గట్టి పోటీగా నిలిచింది. కార్తీకదీపం క్రేజ్‌తో ఈ బ్యూటీ.. డేకి రూ.20 వేలు రెమ్యూనరేషన్ అందుకుందంట.

అర్జనా అనంత్

కార్తీకదీపం సీరియల్ జాతీయ స్థాయిలో అంత పెద్ద సక్సెస్ అయ్యిందంటే ఈ అత్త కూడా ఒక కారణమే. దీపకి అత్తగా తన అద్భుత నటనతో మెప్పించిన అర్జనా అనంత్ ఒక్క రోజుకి గానూ రూ.20 వేలు రెమ్యూనరేషన్ అందుకుందట.

లాస్య (ప్రశాంతి)

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో లాస్యగా తన విలనిజం పండిస్తున్న లాస్య మన తెలుగు అమ్మాయే. అసలు పేరు ప్రశాంతి. నటనలో దడదడలాగిస్తున్న లాస్యకి రోజుకి రూ.15 వేలు మాత్రమే రెమ్యూనరేషన్ అందిస్తున్నారనే టాక్ ఉంది.

జగతి (జ్యోతి రాయ్)

గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా మెప్పిస్తున్న జ్యోతి రాయ్ రెమ్యూనరేషన్ కూడా కుర్ర సీరియల్ హీరోయిన్స్‌కి పోటీగానే ఉంది. ఈమె ఒక్కరోజుకి గానూ.. రూ.20 వేలు రెమ్యూనరేషన్ అందుకుంటుందట.

దివ్య (ఇంచర శెట్టి)

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో తులసికి కూతురుగా వచ్చిన దివ్య అసలు పేరు ఇంచర శెట్టి. ఈమె రెమ్యూనరేషన్ రూ.15 వేలు పైగానే అందుకుంటుందట.

వేద (డెబీజాని మెదక్)

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్‌లో వేదగా గ్లామర్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ పేరు డెబీజాని మెదక్. ఇక ఈమె రెమ్యూనరేషన్ కూడా రూ 20 వేలు పైమాటే నట. మొదట్లో డేకి రూ.15 వేలు ఉండగా.. ఇప్పుడు రేటు పెంచేసిందట వేద.

మల్లి (భావనా లాస్య)

మల్లి సీరియల్‌లో మల్లిగా లీడ్‌ రోల్ చేస్తున్న భావనా లాస్య మన తెలుగు అమ్మాయే. నటిగా ఈమెకు ఇదే ఫస్ట్ సీరియల్. అయినప్పటికీ మల్లి సీరియల్‌లో భావనా లాస్య తన అద్భుత నటనతో ఆకట్టుకుంటుంది. అయితే ఈమె రెమ్యూనరేషన్ రోజుకి రూ.15 వేలు అందుకుంటుందట.

వదినమ్మ (సుజాత)

వదినమ్మ సీరియల్ నటి సుజాత రెమ్యూనరేషన్ కూడా రూ.25 వేలు పైనే. ప్రొడక్షన్ కంపెనీని బట్టి ఈమె రెమ్యూనరేషన్ ఉంటుంది. 1998 నుంచి 2023 వరకూ దాదాపు 55 సీరియల్స్‌లో నటించింది సుజాత. ప్రస్తుతం ఆమె జెమిని టీవీలో ‘గీతాంజలి’ సీరియల్‌లో నటిస్తోంది.

మల్లిక (విష్ణు ప్రియ)

జానకి కలగనలేదులో మల్లిక సందడి లేకపోతే ఆ సీరియల్ ఎప్పుడో మూసేయాల్సిందే అన్నంతంగా ఇతర నటీనటుల్ని డ్యామినేట్ చేస్తుంటుంది మల్లిక. సీరియల్ నటిగా పండిపోయిన విష్ణు ప్రియ.. జానకి కలగనలేదు సీరియల్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుంది. ఇక ఈమె యాక్టింగ్‌లో సీనియర్ కావడంతో.. ఆమె సీనియారిటీకి తగ్గట్టుగానే రోజుకి రూ.15 వేలు రెమ్యూనరేషన్ అందుకుంటుందట.

హమీదా

బ్రహ్మముడి సీరియల్‌లో కావ్యకి అక్కగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న హమీదాకి రెమ్యూనరేషన్ మాత్రం రూ.20 వేలుపైనే అందుకుంటుందట.

రుద్రాణి (షర్మితా గౌడ)

బ్రహ్మముడి సీరియల్‌లో రుద్రాణిగా అలరిస్తున్న ఈ బ్యూటీ పేరు షర్మితా గౌడ . కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ అనేక సీరియల్స్, సినిమాల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ రేంజ్‌కి తగ్గట్టే.. డేకి రూ.20 వేలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.

(నోట్): ఈ రెమ్యూనరేషన్ లెక్కలన్నీ అధికారికంగా వాళ్లు ప్రకటించినవి కావు.. సోషల్ మీడియాలో ప్రచారాన్ని బట్టి సేకరించినవే)

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus