సినిమాలలో నటించడం కోసం నటి నటులు చాలా కష్టపడుతుంటారు. తాము నటించే పాత్రలకు తగ్గట్టుగా తమని తాము అంకితభావంతో మలుచుకుంటూ ఉంటారు. పాత్రకు అవసరం అయినపుడు బరువు కూడా పెరుగుతారు. కొందరు నటులు తాము నటించే పాత్రల కోసం నాన్ వెజ్ సైతం మానేసిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా దేవుడి పాత్రలలో నటించిన సమయంలో నాన్ వెజ్ మానేసినట్టు తెలుస్తోంది. అలా సినిమాల కోసం నాన్ వెజ్ మానేసిన నటులు వీరే..
1. సీనియర్ ఎన్టీఆర్:
శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అనగానే తెలుగు వారి కళ్ళ ముందు మెదిలే రూపం ఎన్టీ రామారావుగారిదే అనే విషయం తెలిసిందే. ఆయన తన కెరీర్ లో ఎన్నో పౌరాణిక పాత్రలలో నటించారు. ఆ చిత్రాలలో నటించిన సమయంలో ఆ సినిమాలు పూర్తి అయ్యేవరకు నాన్ వెజ్ కు దూరంగా, ఎంతో నిష్టగా ఆ పాత్రలను పోషించేవారంట.
2. కింగ్ నాగార్జున:
అక్కినేని నాగార్జున సాయి బాబా పాత్రలో నటించిన మూవీ ‘షిర్డీ సాయి’. ఈ సినిమాని రాఘవేంద్రరావు తెరకెక్కించారు. ఈ మూవీలో నాగార్జున సాయిబాబాగా నటించడంతో ఆ మూవీ పూర్తి అయ్యేవరకు ఎలాంటి మాంసాహారం తీసుకోలేదట.
3. అల్లు అర్జున్:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దువ్వాడ జగన్నాథం. ఈ మూవీలో అల్లు అర్జున్ బ్రాహ్మణుడిగా నటించిన విషయం తెలిసిందే. బ్రాహ్మణులు నాన్ వెజ్ తినరు కాబట్టి, ఆ క్యారెక్టర్ లో నటించినన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా అల్లు అర్జున్ తన షూటింగ్ పూర్తి చేశారంట. బ్రాహ్మణులను గౌరవిస్తూ అల్లు అర్జున్ నాన్ వెజ్ తినకుండా దువ్వాడ జగన్నాథం షూటింగ్ కంప్లీట్ చేశారట.
4. పవన్ కళ్యాణ్:
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో. ఈమూవీ కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘వినోదయ సీతమ్’ కు రీమేక్ గా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈమూవీలో పవన్ కాల దేవుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఎలాంటి నాన్ వెజ్ తినకూడదని నిర్ణయించుకున్నారట.
5. రిషబ్ శెట్టి:
కాంతర మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించడం కోసం హీరో రిషబ్ శెట్టి నాన్ వెజ్ కు దూరంగా ఉన్నాడంట. దైవ కోలా సీక్వెన్స్ షూటింగ్‌కు ముందు 20-30 రోజులు నాన్ వెజ్ తినడం మానేసానని రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
6. అక్షయ్ కుమార్:
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం ఓ మై గాడ్ 2 మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ ఓ మై గాడ్ కు సీక్వెల్ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ లార్డ్ శివ గా నటిస్తున్నారు. ఓ మై గాడ్ మూవీలో అక్షయ్ కుమార్ కృష్ణుడి పాత్రలో నటించారు. ఆ మూవీ షూటింగ్ పూర్తి అయ్యేవరకు నాన్ వెజ్ తినవద్దని అక్షయ్ తల్లి చెప్పడంతో ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యేవరకు నాన్ వెజ్ కు దూరంగా ఉన్నారంట.
7. రణదీప్ హుడా:
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’ సినిమాలో నటించడం కోసం మద్యం, నాన్ వెజ్ ఫుడ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట.
8. పరిణీతి చోప్రా:
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ‘కోడ్ నేమ్ తిరంగ’ అనే మూవీలో నటించింది. ఈ మూవీ కోసం ఆమె నాన్ వెజ్ తినకూడదని నిర్ణయించుకున్నారట.