స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన బ్యూటీ… ఏమైపోయినట్టు..?

  • May 27, 2020 / 10:40 AM IST

జగపతి బాబు, లయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నాలో ఉన్న ప్రేమ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది గజాల. ఆ వెంటనే ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని మరింతగా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ చిత్రం తరువాత వెంటనే ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన ‘కలుసుకోవాలని’… తరుణ్ హీరోగా వచ్చిన ‘అదృష్టం’ వంటి పెద్ద సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. అంతేకాదు ఎన్టీఆర్ తో మరోసారి ‘అల్లరి రాముడు’ చిత్రంలో కూడా నటించి మెప్పించింది.

అయితే ఈమె సడెన్ గా టాలీవుడ్ కు దూరమైపోయింది. అసలు ఈమె ఎందుకు దూరమైపోయింది.. దాని వెనుక ఉన్న కారణం ఏంటి.. ? అని ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ అందరి మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఓ టాలీవుడ్ హీరోతో గజాల ప్రేమాయణం నడపడం… అతన్నే పెళ్ళి చేసుకుందాం అనుకునే తరుణంలో అతను ఈమెకు హ్యాండివ్వడం జరిగిందట. దాంతో ఈమె ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి అని ప్రాణత్యాగానికి కూడా పాల్పడటం.. జరిగిందట.

సమయానికి హీరో అర్జున్ చొరవ చేసుకుని ఆమెను హాస్పిటల్ లో చేర్చడంతో ఆమె బ్రతికి బయట పడినట్టు తెలుస్తుంది. ఇక తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. కొన్నాళ్ళ తరువాత టీవీ సీరియల్ నటుడు ఫైజల్ రాజా ఖాన్ ను వివాహం చేసుకుంది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus