ప్రేమకు వయసు, ప్రాంతం, భాష, కులం, మతం ఏది ఉండదు. అది ఒకరిపై కలిగితే వారితో వివాహం జరిగే వరకు మెదడులో మాయ చేసి ఎంతకైనా తెగించేలా చేస్తుంది. సామాన్యుడైన…సెలెబ్రిటీ అయినా ప్రేమకు అతీతులు కాదు. ప్రేమ ఒకసారి పుట్టిందంటే దానికి మందు పెళ్లే. అలా కాని పక్షంలో అబ్బాయి దేవదాసు, అమ్మయి పార్వతిలా తయారైపోతారు. మన టాలీవుడ్ లో కూడా కొందరు స్టార్ హీరోలు ప్రేమ వివాహాలు చేసుకున్నవారు ఉన్నారు. వారిలో కొందరు స్టార్స్ ఏకంగా మన ప్రాంతం, భాష రాని హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్నారు. తెలుగురాని భార్యలను తెచ్చుకున్న మన తెలుగు హీరోలెవరో చూద్దామా.
నాగార్జున-అమల
టాలీవుడ్ మన్మధుడిగా పేరున్న నాగార్జున అమలను 1992లో ప్రేమ వివాహం చేసుకున్నారు.తెలుగులో అమల మొదటి చిత్రం నాగార్జున హీరోగా 1987లో వచ్చిన కిరాయి దాదా. ఆ సినిమా సమయంలోనే వీరికి పరిచయం ఏర్పడింది. అప్పుడే వీరి మధ్య ప్రేమ కూడా చిగురించిందట. దానితో అత్యధికంగా నాగార్జునతో ఐదు సినిమాలో అమల నటించింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం నిర్ణయం. ఆ సినిమా తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట పెళ్లితో ఒకటయ్యారు. ఇక అమల తండ్రి బెంగాలీ కాగా తల్లి ఐర్లాండ్ మహిళ. నాగార్జునతో పెళ్లి తరువాత ఈమె తెలుగు కొంచెం నేర్చుకున్నారు.
పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్
మొదటి భార్యతో విడిపోయిన తరువాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని వివాహమాడాడు. 2000లో వచ్చిన బద్రి సినిమాతో వెండితెరకు పరిచయమైన రేణు, ఆ సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్ తో పీకలలోతు ప్రేమలో పడింది. దీనితో ఆమె యాక్టింగ్ పై మక్కువ వదిలేసింది. బద్రి తరువాత అప్పటికే ఒప్పుకున్న జేమ్స్ పండు అనే తమిళ సినిమా చేసిన ఆమె మళ్ళీ 2003లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జానీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. చాలా కాలం రిలేషన్ లో ఉన్న పవన్-రేణు దేశాయ్ 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక రేణు పుణేలో స్థిరపడిన గుజరాతి అమ్మాయి. పవన్ తో వివాహం తర్వాత తెలుగు నేర్చుకున్నారు.
మహేష్-నమ్రత శిరోద్కర్
సూపర్ స్టార్ మహేష్ పెళ్లి కూడా సినిమాటిక్ గా జరిగింది. ఆయన బాలీవుడ్ హీరోయిన్ నమ్రతను రహస్య వివాహం చేసుకున్నారు. మాది రహస్య వివాహం కాదని ఆయన ఎన్ని సార్లు బుకాయించినా అదే నిజం. మహేష్, నమ్రతల పెళ్లి పూర్తి అయ్యేవరకు ఎవరికీ తెలియదు. మహేష్ వివాహం అప్పట్లో పెద్ద సంచలనంగా మీడియాలో కథనాలు రావడం జరిగింది. 2000లో విడుదలైన వంశీ మూవీలో జంటగా నటించిన మహేష్, నమ్రత ఆ సినిమా సమయంలోనే ఒకరిపై మరొకరు మనసు పారేసుకున్నారు. ఐతే అప్పటి నుండి ఐదేళ్లు వీరి ప్రేమ వ్యవహారం రహస్యంగానే సాగింది. 2005లో వీరు కేవలం సన్నితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి సినిమాలకు రిటైర్మెంట్ తీసుకున్న నమ్రత… గౌతమ్, సితారలకు తల్లి. ఇక మరాఠీ అయిన నమ్రతకు తెలుగు ఒక్క ముక్కరాదు. ఎందుకంటే అసలు మన మహేష్ కే తెలుగు రాదు కాబట్టి.
నాగ చైతన్య సమంత
సమంత డెబ్యూ మూవీ 2010లో నాగ చైతన్య హీరోగా వచ్చిన ఏమాయ చేశావే. నాగ చైతన్యకు కూడా ఇది కేవలం రెండో చిత్రం మాత్రమే. అప్పుడు వీరికి పరిచయం ఏర్పడింది. ఇక అక్కినేని మూడు తరాలకు చెందిన హీరోలు కలిసి నటించిన మనం సినిమాలో మరో మారు సమంత, చైతూ కలిసి నటించారు. అప్పుడే వీరి ప్రేమకు గట్టి బీజం పడింది. 2017లో నాగ చైత్యన్య సమంతను పెళ్లి చేసుకున్నారు. ఇక సమంత మలయాళీ తల్లి, తెలుగు తండ్రికి పుట్టిన అమ్మాయి. ఐతే వీరి కుటుంబం చెన్నైలో సెటిల్ కావడంతో తమిళియన్ గానే పెరిగింది. సమంత టాలీవుడ్ కి వచ్చాక తెలుగు నేర్చుకున్నారు.