అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్!

సినిమాలో హీరో తరువాత ఎవరంటే విలనే. ఓ సినిమా తరువాత మనల్ని వెంటాడే జ్ఞాపకాలలో ఖచ్చితంగా విలన్ ఉంటాడు. హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలంటే విలన్ క్యారెక్టర్ బలమైనదై ఉండాలి. ఏళ్లుగా విలన్స్ హీరోల ఇమేజ్ పెరగడంలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు తెరపై పండించే క్రూరత్వం ప్రేక్షకులకు వారిపై చెడ్డ అభిప్రాయం, కోపం కలిగేలా చేస్తుంటాయి. ఆధునిక యుగంలో అది కేవలం నటన మాత్రమే, వాళ్లు మనలాగే మనుషులే అని తెలుస్తున్నప్పటికీ… గతంలో వాళ్ళను చాల మంది బయట కూడా విలన్స్ లానే ట్రీట్ చేశేవారు. తెరపై కనిపిస్తే తిట్ల దండకం అందుకునే వాళ్ళు. ఇప్పటికీ మన ఇళ్లలో బామ్మలు తెరపై విలన్స్ ని చూసి శాపనార్థాలు పెట్టడం మనకు అనుభవమే.

తెరపై భయకరమైన గెటప్స్ తో, దుర్మార్గమైన చర్యలతో భయపెట్టే ఈ విలన్స్ ఆఫ్ స్క్రీన్ జీవితం మనలాగే సాధారణమే. వారికి అందమైన జీవితాలు ఆకర్షణీయమైన భార్యలు ఉన్నారు. మరి తెరపై అద్భుత విలనీ చూపిన మన విలన్స్ అందమైన భార్యల గురించి తెలుసుకుందాం

రఘు వరన్ 

విలక్షణ విలన్ గా సౌత్ ఇండియా మొత్తం ఫేమస్ రఘు వరుణ్. ఆజానుబాహుడైన రఘువరన్ నటన భాషా, ఒకే ఒక్కడు వంటి సినిమాలలో అద్భుతం అని చెప్పాలి. వందల చిత్రాలలో నటించిన ఈ విలన్ మాత్రం రియల్ లైఫ్ లో హీరో వలె లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆమె ఎవరో కాదు. 80-90 లలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న రోహిణి. వీరిద్దరూ 1994లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఐతే వ్యక్తిగత కారణాలతో 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నాలుగేళ్లకు 2008లో రఘువరన్ గుండెపోటుతో మరణించారు.

1

2

3

ప్రకాష్ రాజ్ 

విలన్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ప్రకాష్ రాజ్ బయోగ్రఫీ చెప్పాలంటే నాలుగు పదాలలో ముగించే వ్యవహారం కాదు. పాత్ర ఏదైనా తనకు తానేసాటి అనిపించుకున్న ఈ నటుడు వైవాహిక జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈయన 1994లో నటి లలిత్ కుమారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. 2009లో ఆమెతో విడిపోయిన ప్రకాష్ రాజ్ 2010లో కొరియోగ్రాఫర్ పొన్నీ వర్మను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇప్పుడు ఓ బాబు ఉన్నాడు.

1

2

3

4

5

మురళి శర్మ 

తెలుగు మూలాలున్న హిందీ నటుడు మురళి శర్మ తెలియని వారుండరు. ఆయన ప్రస్తుతం తెలుగులో హాట్ ఫేవరేట్ విలన్ అండ్ క్యారక్టర్ ఆర్టిస్ట్. అతిథి సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మురళీశర్మ 2009లో నటి అశ్విని కల్సేకర్ ని వివాహమాడారు. విశేషం ఏమిటంటే ఈ విలన్ మరో విలన్ ని పెళ్లాడాడు. అశ్విని బద్రినాధ్, నిప్పు, రక్త చరిత్ర వంటి సినిమాలో ఈమె లేడీ విలన్ గా చేశారు.

1

2

3

4

5

అజయ్

రాజమౌళి విలన్స్ లో విక్రమార్కుడు సినిమాలో టిట్లాను, అంత తేలికగా ఎవరు మరచిపోరు. జయింట్ బాడీతో హీరోలకు కూడా చెమటలు పట్టించే ఈ తెలుగు విలన్ జీవితంలో ఓ అందమైన భార్యను వివాహం చేసుకున్నారు. శ్వేతా రావూరిని అజయ్ 2006లో వివాహం చేసుకోగా, ఆమె 2017 మిసెస్ ఇండియా వరల్డ్ 2017 ఫైనలిస్ట్ కావడం విశేషం.

1

2

3

4

5

అశుతోష్ రానా

డైరెక్టర్ శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో 2004లో వచ్చిన వెంకీ చిత్రంలో క్రిమినల్ పోలీస్ గా నటించాడు అశుతోష్ రానా. ఆ సినిమా తర్వాత ఆయన చాల తెలుగు సినిమాలో కనిపించాడు. అశుతోష్ రానా బాలీవుడ్ నటి రేణుకా సహానే ను విహాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

1

2

3

4

5

రాహుల్ దేవ్ 

మహేష్ బాబు హీరోగా వచ్చిన కౌ బాయ్ మూవీ టక్కరి దొంగ చిత్రంతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయమైన రాహుల్ దేవ్ సింహాద్రి, మాస్ చిత్రాల్లో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన 1998లో రీనా దేవ్ ని పెళ్లి చేసుకోగా, ఆమె 2009లో క్యాన్సర్ తో మరణించడం బాధాకర విషయం.

సోను సూద్

కాష్మోరా మారిన పశుపతిగా అరుంధతి సినిమాలో విలనిజం పీక్స్ లో పండించిన సోను సూద్ తెలుగులో చాల సినిమాలలో విలన్ గా చేశారు. ఈ సిక్స్ ప్యాక్ విలన్ తెలుగు మూలాలున్న సోనాలి ని 1996 సెప్టెంబర్ 25న వివాహం చేసుకున్నాడు. వీరికి ఇప్పుడు ఇద్దరు సంతానం ఉన్నారు.

1

2

3

4

5

కబీర్ దుహన్ సింగ్ 

జిల్, కిక్ 2, డిక్టేటర్, సర్ధార్ గబ్బర్ సింగ్ తో పాటు అనేక తెలుగు సినిమాలో నటించిన కబీర్ దుహన్ బ్యూటీఫుల్ సింగర్ డాలీ సిద్ధు ని వివాహం చేసుకున్నాడు. గత ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగింది.

1

2

3

4

5

కాలకేయ ప్రభాకర్ 

మహేష్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన అతిథి సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రభాకర్, మర్యాదరామన్న సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బాహుబలి సినిమాలో ఆయన చేసిన కాలకేయ రోల్ ఎంత ఫేమస్సో తెలిసిన విషయమే . ఈ భారీ విలన్ రాజ్యలక్ష్మీ ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం.

సాయాజీ షిండే

వాచ్ మెన్ గా కెరీర్ మొదలుపెట్టి నటనపై మక్కువతో సినిమాలలోకి ప్రవేశించారు సాయాజీ షిండే. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాలో నటించిన సాయాజీ షిండే వందనా షిండే ను పెళ్లి చేసుకున్నారు. వీరికి సిద్ధార్ధ్ షిండే అనే ఓ కుమారుడు ఉన్నాడు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus