SKN: టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయిన బేబీ నిర్మాత!

‘బేబీ’ చిత్రంతో కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు ఆ చిత్ర నిర్మాత శ్రీనివాస్ కుమార్ నాయుడు అలియాస్ ఎస్.కె.ఎన్. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ఇతన్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇతను స్టేజి ఎక్కి మైక్ పట్టుకుని..స్పీచ్ లు ఇస్తే అవి నాలుగైదు రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అందరికీ ఎస్.కె.ఎన్ లో ఒక యాంగిల్ మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ ఇతని సినీ కెరీర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

చిరంజీవి, అల్లు అర్జున్లకి వీరాభిమానిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఓ జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన ఎస్.కె.ఎన్.. ఆ తర్వాత పీఆర్ఓ గా ఎన్నో సినిమాలకు పనిచేశాడు.’లైఫ్ అలా చాలు’ అని అతను అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత నిర్మాత మారి తొలి ప్రయత్నంగా ‘ఈ రోజుల్లో’ అనే చిత్రాన్ని నిర్మించాడు. అతి తక్కువ బడ్జెట్ లో తీసిన ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి భారీ లాభాలను మిగిల్చింది.

టాలీవుడ్ కి మారుతి లాంటి స్టార్ డైరెక్టర్ ను అందించింది ఎస్.కె.ఎన్. అలాగే ‘టాక్సీ వాలా’ తో రాహుల్ సంకృత్యన్ కి దర్శకుడిగా లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు ‘బేబీ’ తో సాయి రాజేష్ కి కూడా లైఫ్ ఇచ్చాడు. టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడంలో ఎస్.కె.ఎన్ ముందుంటాడు. ప్రియాంక జవాల్కర్, వైష్ణవి చైతన్య వంటి హీరోయిన్లకి కూడా లైఫ్ ఇచ్చింది ఎస్.కె.ఎన్. అంతేకాదు విజయ్ దేవరకొండ కి ‘టాక్సీ వాలా’ , ఆనంద్ దేవరకొండ కి ‘బేబీ’ వంటి బ్లాక్ బస్టర్స్ ను అందించిన ఘనత సాధించడమే కాకుండా వాళ్లకి లక్కీ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు.

ఇప్పుడు (SKN) ఎస్.కె.ఎన్ నిర్మాణంలో సినిమాలు చేయడానికి హీరోలందరూ రెడీ అంటున్నారు. అయితే తన నెక్స్ట్ సినిమాని ఎస్.కె.ఎన్ .. ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ తో చేయబోతున్నారు. హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఆల్రెడీ మోస్ట్ వాంటెడ్ ప్రొడ్యూసర్ గా మారిపోయిన ఎస్.కె.ఎన్ .. నెక్స్ట్ ప్రాజెక్ట్ తో కూడా సక్సెస్ సాధిస్తే.. స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus