Nandamuri Heroes: దేవర మాత్రమే కాదు ఆ నందమూరి హీరో మూవీ కూడా రెండు భాగాలే.. కానీ?

  • October 6, 2023 / 09:56 PM IST

నందమూరి హీరోలకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోందని వైరల్ అవుతున్న వార్త నందమూరి అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. అయితే కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న డెవిల్ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. డెవిల్ పార్ట్1 వచ్చే నెలలో విడుదల కానుండగా పార్ట్1 విడుదలైన తర్వాత సెకండ్ పార్ట్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.

నందమూరి యంగ్ జనరేషన్ హీరోలు వరుసగా తమ సినిమాలను రెండు భాగాలుగా విడుదల చేస్తూ అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. నందమూరి హీరోల సినిమాలు నిర్మాతలకు సైతం కళ్లు చెదిరే లాభాలను అందిస్తుండగా నందమూరి హీరోల సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. బాలయ్య నటించిన భగవంత్ కేసరి ఈ నెల 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ నెల 8వ తేదీన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. నందమూరి హీరోల సినిమాలన్నీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ ట్రాక్ లో ఉండగా కళ్యాణ్ రామ్ మాత్రం సక్సెస్ ట్రాక్ లోకి రావాల్సి ఉంది. డెవిల్ సినిమాకు కళ్యాణ్ రామ్ మార్కెట్ ను మించి ఖర్చు చేశారని తెలుస్తోంది.

పాన్ ఇండియా మూవీగా డెవిల్ రిలీజ్ కానుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. నందమూరి హీరోలు పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెడుతుండగా రాబోయే రోజుల్లో నందమూరి హీరోలకు ఎలాంటి విజయాలు సొంతమవుతాయో చూడాలి. నందమూరి హీరోల మల్టీస్టారర్ తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus