Devara Movie: దేవర ఫస్ట్ సింగిల్ విషయంలో అలా ప్లాన్ చేస్తారా.. ముందే సర్ప్రైజ్ అంటూ?

  • May 14, 2024 / 10:56 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ (Janatha Garage) అంచనాలను మించి హిట్టైంది. కొరటాల శివ సినీ కెరీర్ లో మూడో సినిమాగా తెరకెక్కిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ ను షేక్ చేయగా ఆరో సినిమాగా దేవర (Devara) తెరకెక్కుతోంది. ఒకింత భారీ క్యాస్టింగ్ తో దేవర తెరకెక్కుతుండగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం. అయితే పుష్ప2 (Pushpa2) ఫస్ట్ సింగిల్ ను మించేలా దేవర ఫస్ట్ సింగిల్ ఉండబోతుందని ఈ సినిమా కోసం అనిరుధ్ (Anirudh Ravichander) అదిరిపోయే ట్యూన్ ఇచ్చారని సమాచారం అందుతోంది.

అనిరుధ్ తమిళంలో సక్సెస్ అయిన స్థాయిలో తెలుగులో సక్సెస్ కాలేదనే సంగతి తెలిసిందే. దేవర సినిమాతో అనిరుధ్ కు తెలుగులో ఆ లోటు కూడా తీరబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అనిరుధ్ ఈ సినిమాకు ఒకింత కసితో పని చేస్తున్నారని తెలుస్తోంది. దేవర సినిమా నుంచి వచ్చే అప్ డేట్స్ ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20వ తేదీన కాగా ఒకరోజు ముందే దేవర ఫస్ట్ సింగిల్ విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. తారక్ పుట్టినరోజున షాకింగ్ అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ఆనందించేలా మేకర్స్ ప్లాన్ ఉందని సమాచారం అందుతోంది. దేవర సినిమా 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది.

తారక్, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కాంబో సీన్స్ సరికొత్తగా ఉంటాయని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వేగంగా సినిమాల్లో నటిస్తుండగా తారక్ పుట్టినరోజున వార్2 సినిమా అప్ డేట్ కూడా వస్తుందేమో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus