సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సీరియల్ నటి కన్నుమూత.!

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.ఇప్పటివరకు చూసుకుంటే.. ఎస్.కె.ఎన్ తండ్రి, సీనియర్ హీరో వేణు తండ్రి, దర్శకుడు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్, ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్, త్రినాథ్ రావు నక్కిన తండ్రి నక్కిన సూర్యారావు, మలయాళ నటి కనకలత వంటి వారు మృతి చెందారు. టాలీవుడ్లోనే కాకుండా మిగిలిన సినీ పరిశ్రమలో కూడా ఇలాంటి విషాదాలు చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో సీరియల్ నటి రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరినీ షాక్ కి గురి చేసినట్లు అయ్యింది. వివరాల్లోకి వెళితే బుల్లితెర నటి..పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి (బి) గ్రామం.. నేషనల్ హైవే వద్ద ఈ యాక్సిడెంట్ చోటు చేసుకున్నట్లు సమాచారం.పవిత్ర తన సొంత ఊరు..అంటే కర్ణాటక జిల్లాలోని ఒక గ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ కి వస్తుండగా..

ఆమె కారు అదుపుతప్పి డివైడర్‏ను ఢీకొట్టి.. రైట్ సైడ్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టినట్టు పోలీసులు తెలియజేశారు. ఈ క్రమంలో పవిత్ర జయరామ్ అక్కడిక్కడే మరణించారట. ఆమెతో పాటు కారులో ఉన్న మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయని, వారు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలియజేశారు. ‘త్రినయని’ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర జయరాం.. ఇలా మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టేసింది అనే చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus