Akhil: ఆ తమిళ డైరెక్టర్ కు అఖిల్ ఛాన్స్ ఇస్తాడా..?

  • October 18, 2022 / 12:28 PM IST

గత ఏడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తో హిట్టు కొట్టి ఊపిరి పీల్చుకున్నాడు అఖిల్. అక్కినేని అభిమానులు ఇతన్ని స్టార్ హీరోగా చూడాలనుకున్నారు. కానీ మిడ్ రేంజ్ హీరోల లిస్ట్ లో అయినా చేరకపోవడంతో చాలా డిజప్పాయింట్ అయ్యారు. అయితే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం అఖిల్ ఖాతాలో హిట్టు పడేలా చేసింది. ఇక తర్వాత చిత్రాన్ని మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సురేందర్ రెడ్డితో చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.

‘ఏజెంట్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. విడుదల తేదీ అనౌన్స్ చేశారు కానీ షూటింగ్ అనుకున్న టైంకి పూర్తికాకపోవడంతో రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. ఈ చిత్రం కోసం అఖిల్ పారితోషికం తీసుకోకుండా పనిచేస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా.. ఏజెంట్ తర్వాత అఖిల్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది.

‘గాడ్ ఫాదర్’ తో హిట్టు కొట్టిన దర్శకుడు మోహన్ రాజా.. అఖిల్- నాగార్జున లతో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ విషయం పై దర్శకుడు మోహన్ రాజా కూడా క్లారిటీ ఇచ్చాడు. ‘అది నిజమే కాకపోతే స్క్రిప్ట్ ఫైనల్ అవ్వాల్సి ఉంది. స్క్రిప్ట్ ఫైనల్ అయితేనే ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది’ అని ఆయన తెలిపాడు. ఇదిలా ఉంటే.. అఖిల్ తో సినిమా చేయాలని మరో తమిళ దర్శకుడు కూడా వెయిటింగ్ లో ఉన్నట్లు తెలిపి ఆశ్చర్యపరిచాడు.

కార్తితో ‘సర్దార్’ వంటి థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పి.ఎస్.మిత్రన్ అఖిల్ తో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్టు ‘సర్దార్’ ప్రమోషన్స్ లో తెలిపాడు. ‘సర్దార్’ చిత్రాన్ని తెలుగులో ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కనుక హిట్ అయితే ఇదే బ్యానర్లో మిత్రన్ అఖిల్ తో సినిమా చేసే అవకాశాలు ఉంటాయి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus