సీక్రెట్ గా హీరోయిన్‌ నిక్కీ గల్రానితో ఆది పినిశెట్టి నిశ్చితార్థం..వైరల్ అవుతున్న ఫోటోలు!

  • March 26, 2022 / 10:46 PM IST

ఫైనల్ గా మరొక ప్రేమజంట పెళ్లికి సిద్ధం అయ్యింది. సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా లవర్స్ గా కొనసాగుతున్న ఆది పినిశెట్టి నిక్కీ, నిక్కీ గల్రాని పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక రకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వార్తలు ఎంత వైరల్ అవుతున్న కూడా ఇద్దరూ ఒక్కసారి కూడా వాటిపై పెద్దగా స్పందించలేదు. కానీ నిత్యం బయట ప్రపంచంలో మాత్రం కలసి తిరుగుతూనే ఉన్నారు. అంతేకాకుండా ఇరువర్గాల ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్ లో కూడా పాల్గొన్న ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలానే వైరల్ అయ్యాయి.

Click Here To Watch NOW

ఇక ఇప్పుడు ఫైనల్గా ఆది పినిశెట్టి తను ప్రేమించిన హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు అఫీషియల్గా క్లారిటీ ఇచ్చేశాడు. ఆది పినిశెట్టి నిక్కీ ఇద్దరు కూడా ఇదివరకే కలిసి రెండు సినిమాల్లో నటించడం జరిగింది. తెలుగులో వచ్చిన మలుపు సినిమా లో అలాగే ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన మరకతమణి సినిమా లో కూడా ఆది పినిశెట్టి, నిక్కీ మంచి జోడీ గా ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ హీరో హీరోయిన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత ఏడాది నుంచి అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

 

ఇక ఫైనల్ గా ఇప్పుడు ఆది పినిశెట్టి సోషల్ మీడియాలో నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేస్తూ అఫీషియల్ గా ఇద్దరం ఒకటైనట్లు తెలియజేశాడు. తాము ఇద్దరం చాలా కాలం క్రితమే జంటగా సెట్టయ్యాము అంటూ ఇప్పుడు అఫీషియల్గా మరింత దగ్గర అయినట్లు చెప్పుకొచ్చాడు. నిశ్చితార్థం ఈనెల 24వ తేదీన జరిగినట్లు చెబుతూ వేడుకలో కేవలం ఇరువర్గాల కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నట్లు ఆది పినిశెట్టి వివరణ ఇచ్చాడు.

 

ఆది పినిశెట్టి ఒకవైపు హీరోగా చేస్తూనే మరొక వైపు నెగిటివ్ పాత్రలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. అలాగే హీరోగా ఆది పినిశెట్టి ఒక తమిళ సినిమా కూడా చేస్తున్నాడు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus