ప్రేమకావాలి, లవ్ లీ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఆది సాయికుమార్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అయితే ఈ మధ్య కాలంలో కథ, కథనం విషయంలో చేస్తున్న పొరపాట్ల వల్ల ఆది సాయికుమార్ కు సరైన విజయాలు దక్కడం లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆదిసాయికుమార్, ఆది భార్య అరుణ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆది మాట్లాడుతూ మా సిస్టర్ పెళ్లికి అరుణ వాళ్లు వచ్చారని ఆ సమయంలోనే తనను తొలిసారి చూశానని చెప్పారు.
అరుణ కుటుంబం నుంచి పెళ్లి ప్రపోజల్ రావడంతో ఫోటోలు చూసి ఓకే చెప్పానని ఆది తెలిపారు. అరుణ మాట్లాడుతూ ఆదితో పెళ్లి అని చెప్పిన సమయంలో గూగుల్ చేసి ఆది గురించి తెలుసుకున్నానని అన్నారు. మా పెళ్లి చూపులు ఎయిర్ పోర్ట్ లో జరిగాయని ఆమె చెప్పుకొచ్చారు. ఆది మాట్లాడుతూ ఎయిర్ పోర్ట్ లో అరుణతో నా ఫీల్డ్ గురించి చెప్పానని సినిమా రంగంలోని ఒడిదొడుకుల గురించి చెప్పానని అన్నారు.
అదేరోజు పెళ్లికి ఓకే చెప్పానని తనతో కలిసి సంతోషంగా ఉంటాననే నమ్మకం కలిగిందని ఆది పేర్కొన్నారు. హనీమూన్ లోనే మొదట గొడవైందని ఆది సాయికుమార్ చెప్పుకొచ్చారు. ఆది గురించి అరుణ మాట్లాడుతూ ఆది అస్సలు బహుమతులు ఇచ్చే రకం కాదని అన్నారు. ఆది కొంచెం బద్ధకస్తుడు అంటూ ఆమె షాకింగ్ కామెంట్లు చేశారు. ఆదికి నేను చాలా బహుమతులు ఇచ్చానని అయితే ఆ బహుమతులను ఆది పోగొట్టాడని అరుణ తెలిపారు.
ఆది (Aadi Saikumar) మాట్లాడుతూ అనవసరంగా లిప్ లాక్ ఇవ్వకు అని అరుణ షరతు పెట్టిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భార్య చేతి కాఫీ మాత్రమే తాగాలని అనిపిస్తోందని ఆది కామెంట్లు చేశారు. తను టెన్షన్ పడకూడదని కొన్నిసార్లు నిజాలు దాచేస్తానని ఆది అన్నారు.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా