Celebrities: పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

చిత్ర పరిశ్రమలో డేటింగ్ అనేది సర్వసాధారణం. ఇద్దరు ఇష్టపడితే చాలు కలిసి సహజీవనం చేస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రమే తమ రిలేషన్ని పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు. మరికొంతమంది హీరోయిన్లు అయితే పెళ్లికి ముందే డేటింగ్ చేసి గర్భం దాల్చుతున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు (Celebrities) పెళ్లికి ముందే గర్భంగా దాల్చారు. అలాంటి వారిపై ఓ లుక్కేద్దాం.

రేణుదేశాయ్

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం పెళ్లికి ముందే అకీరా నందనక్కు జన్మనిచ్చింది. ‘బద్రి’ సినిమాతో ప్రేమలో పడిన ఈ జంట.. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసి అకీరా పుట్టాక పెళ్లి చేసుకుంది. మరో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత విడాకులు తీసుకున్నారు.

పూర్ణ

మలయాళీ బ్యూటీ పూర్ణ సైతం పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ‘సీమ టపాకాయ్’, ‘అవును’చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. గతేడాది అక్టోబర్లో దుబాయ్ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడింది. ఆరు నెలలు గడవకముందే ఏప్రిల్ 4న ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

ఇలియానా

ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగింది ఇలియానా. ఆ తర్వాత బాలీవుడికి మకాం మార్చింది. అయితే అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఇలియానా ఇటీవల షాకింగ్ విషయం తెలిపింది. త్వరలోనే తాను తల్లిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో కొన్నాళ్లు డేటింగ్లో ఉన్న ఇలియానా.. 2019లో అతనితో విడిపోయింది. అప్పటి నుంచి ఆమె సింగిల్గానే ఉంటుంది. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. కానీ ఇలియానా మాత్రం ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు సడెన్గా తల్లిని కాబోతున్నట్లు వెల్లడించి అందరికి షాకిచ్చింది. త్వరలోనే బిడ్డకి తండ్రి ఎవరో ప్రకటించి, పెళ్లి పీటలేక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అలియా భట్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ సైతం పెళ్లికి ముందే గర్భం దాల్చింది. హీరో రణబీర్ కపూర్తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన అలియా.. 2022 ఏప్రిల్లో అతన్ని పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే అలియా ప్రెగ్నెంట్. కానీ వివాహం అయిన రెండు నెలల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. గతేడాది నవంబర్లో ఈ జంట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అమీ జాక్సన్

ఎవడు, రోబో 2.0 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి అమీ జాక్సన్. నటిగా కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. చాలా రోజుల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ హీరోయిన్లు దియా మీర్జా కల్కి కొచిన్, నేహా ధూపియా అమృత అరోరా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus