Yash, Aamir Khan: థియేట్రికల్ క్లాష్: కేజీఎఫ్ వర్సెస్ లాల్ సింగ్ చద్దా..!

కన్నడ హీరో యష్ ని సూపర్ స్టార్ చేసేసింది ‘కేజీఎఫ్’ సినిమా. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక్క కన్నడలో కాకుండా అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘కేజీఎఫ్ చాఫ్టర్ 2’ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈపాటికే సినిమా విడుదల కావాల్సింది కానీ వాయిదా పడింది.

వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేస్తామని ‘కేజీఎఫ్’ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా ఆమిర్ ఖాన్ తన ‘లాల్ సింగ్ చద్దా’ను విడుదల చేయబోతున్నారు. ‘కేజీఎఫ్’ సినిమా పాన్ ఇండియా స్టోరీ.. బాలీవుడ్ లో కూడా విడుదల చేయబోతున్నారు. కానీ ఆమిర్ ఖాన్ సినిమా పోటీకి వస్తుందంటే.. హిందీలో థియేటర్ల సమస్య వస్తుంది. పైగా ‘లాల్ సింగ్ చద్దా’పై బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.

మరి ‘కేజీఎఫ్’ టీమ్ ఆమిర్ ఖాన్ తో పోటీ పడుతుందా..? లేక మళ్లీ తమ సినిమాను వాయిదా వేసుకుంటుందా..? అనేది చూడాలి. ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతోనే నాగచైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో చైతు.. బాల అనే ఆంధ్ర కుర్రాడిగా కనిపించనున్నారు. ఆమిర్ ఖాన్ తో కలిసి కార్గిల్ యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందే సైనికుడి పాత్ర పోషించారు చైతు. హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus