Ira Khan: హాట్ టాపిక్ గా మారిన ఐరా ఖాన్ లేటెస్ట్ ఫోటో..!

  • July 28, 2021 / 03:05 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో.. అభిమానులు ముద్దుగా మిస్టర్‌ పర్ఫెక్ట్‌ అని పిలుచుకునే ఆమిర్ ఖాన్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మధ్యనే తన రెండో భార్యతో విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించి మరింతగా వార్తల్లో నిలిచాడు. అయితే ‘బాప్ ఏక్ నంబరి.. బేటా దస్ నెంబరీ’ అని ‘మనసంతా నువ్వే’ లో సునీల్ చెప్పినట్టు.. ఆమిర్ కంటే కూడా అతని కూతురు ఐరా ఖాన్‌.. 10 రెట్లు బోల్డ్ గా ఉందనే చెప్పాలి.

సెకండ్ లాక్ డౌన్ కు రెడీ అంటూ ఆమె ప్రియుడు నుపుర్ తో కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసి సోషల్ మీడియాని షేక్ చేసిన ఈ అమ్మడు.. తర్వాత అతనితో కలిసి ఉన్న చాలా ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది. గ్లామర్ ఫోటోలను షేర్ చేయడంలో కూడా ఈమె ముందుంటుంది అన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈమె ఇటీవల పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈ ఫొటోలో ఐరా తన కుక్కపిల్లను కాళ్ల మీద పడుకోబెట్టుకుని దాని నెత్తి పై రుద్దుతోంది. ఈ ఫోటోని మరింతగా పరిశీలిస్తే.. ఐరా వద్ద సిగరెట్ బాక్స్‌ లేదా లైటర్‌ వంటిది ఒకటి కనిపిస్తుందని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. దీంతో ఐరా ఖాన్‌ సిగరెట్‌ తాగుతుందా? అని మరికొందరు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. ఇది నిజమో కాదో అన్న విషయాన్ని పక్కన పెడితే ఐరా ఖాన్ లేటెస్ట్ ఫోటో పెద్ద వైరల్ అవుతుందనే చెప్పాలి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus