Abhiram: అందరి ముందు తేజ గారు నన్ను తిట్టారు…అభిరామ్ కామెంట్స్ వైరల్!

  • May 29, 2023 / 01:33 AM IST

దగ్గుబాటి వారసుడుగా అహింస సినిమా ద్వారా ప్రేక్షులముందుకు రాబోతున్నారు నటుడు అభిరామ్. తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 2 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిరామ్ ఈ సినిమా గురించి పలు విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా అభిరామ్ మాట్లాడుతూ… ఒకరోజు తేజ గారు మా ఇంటికి వచ్చి ఈ సినిమా కథ చెప్పారు.

ఈ కథ విన్న నాన్న, చిన్నాన్న తాను (Abhiram) ఇండస్ట్రీలోకి రావడానికి ఇదే సరైన సమయం అని చెప్పి ఈ సినిమాకు ఒప్పుకున్నామని తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ ను ఎత్తుకొని పరిగెడుతూ చేసే సన్నివేశంలో నటించే సమయంలో తాను కింద పడటంతో ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నానని తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో తేజ గారు అందరి ముందు మైక్ లో తిట్టారని తెలిపారు.

నీకు ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా నాకు సంబంధం లేదు. ఆడియెన్స్ కోసమే నేను సినిమా చూస్తున్నాను ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నటించు అంటూ కేకలు వేశారు. ఇక సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత నాన్న, బాబాయ్ అన్నయ్య సినిమా చూసి చిన్న చిన్న మార్పులు చెప్పారని అభిరామ్ తెలిపారు.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తనకు చాలా భయంగా ఉందని అభిరామ్ తెలిపారు.ఆ భయంతో రాత్రి పూట నిద్ర కూడా పట్టడం లేదని పేర్కొన్నారు.

మరో ఇంటర్వ్యూలో.. మిమ్మల్ని ఎన్నో విషయాలు అడగాలని మీడియా వాళ్లందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్లను ఎలా ఫేస్‌ చేస్తున్నారని ప్రశ్నించగా.. విషయం ఏదైనా తప్పు చేస్తే భయపడాలి. ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం సినిమాపైనే ఉందని ఆయన బదులిచ్చారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus