బిగ్ బాస్ 4: హౌస్ లో ఈవారం ఏం జరిగింది..?

  • December 4, 2020 / 04:05 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 లో అభిజిత్ కి క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. టైటిల్ ఫేవరెట్ గా దూసుకుపోతున్నాడు. ఓటింగ్ పర్సెంటేజ్ లో కూడా తన ప్రభావాన్ని ప్రతివారం చూపిస్తూ టాప్ ప్లేస్ లో ఉంటున్నాడు అభిజిత్. ఈ టైమ్ లో అభిజిత్ బిగ్ బాస్ హౌస్ లో జైల్లోకి వెళ్లాడు అనే వార్త సోషల్ మీడియాని ఊపేస్తోంది. అసలు అభిజిత్ జైలుకి ఎందుకు వెళ్లాడు..? ఈవారం గేమ్ లో ఏం జరిగింది అనేది ఆసక్తిగా మారుతోంది.

బిగ్ బాస్ రేస్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా ఉయ్యాల ఊగుతూ అఖిల్ టాప్ – 5 టిక్కెట్ ని సంపాదించనట్లుగా న్యూస్ తెలుస్తోంది. సోహైల్ గేమ్ ఓడిపోయాక ఏడుస్తూ అభిజిత్ ని గట్టిగా హగ్ చేస్కున్నాడు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు, సోహైల్ ఉయ్యాల తనంతట తానే దిగిపోయాడా..? లేదా శాక్రిఫైజ్ చేశాడా అనేది కూడా ఇంకా అఫీషియల్ గా అయితే తెలియలేదు. ఇదే టైమ్ లో అభిజిత్ ఈవారం జైల్ కి వెళ్లాడు అనే వార్త చక్కర్లు కొడుతోంది.

రేస్ టు ఫినాలే టాస్క్ అయిపోయిన తర్వాత నెంబరింగ్ గేమ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ పార్టిసిపేట్ చేశారు. ఇందులో అఖిల్ ఫినాలే టిక్కెట్ గెలిచాడు కాబట్టి టాప్ – 1 నుంచి టాప్ – 6 వరకూ నెంబరింగ్ గేమ్ అనేది జరిగింది. ఇందులో టాప్ – 1 నెంబర్ దగ్గర సోహైల్ నిలుచుని ఉంటే, టాప్ – 6 దగ్గర అభిజిత్ ఉన్నాడని, అందుకే జైల్ కి వెళ్లాల్సి వచ్చిందని అంటున్నారు. మరి ఇంది ఎంతవరకూ నిజమో అనేది ఎపిసోడ్ టెలికాస్ట్ అయితేనే కానీ తెలియదు. మొత్తానికి అదీ మేటర్.

[yop_poll id=”1″]

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus