బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పుడంటే ఈయన్ని సీనియర్ హీరో అంటున్నారు కానీ.. గతంలో స్టార్ హీరో రేంజ్లో సూపర్ హిట్లను అందించిన వారిలో ఇతను కూడా ఒకరు. హై ఇంటెన్సిటీ, ఎమోషనల్ డ్రామా మరియు పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్స్ మన రాజశేఖర్. అంతేకాదు ఎన్నో ఫ్యామిలీ మూవీస్ ను కూడా అందించారు. ఈయన్ని ప్రేక్షకులు మరిచిపోతున్నారు అనుకునే టైములో సాలిడ్ హిట్ ఇచ్చి.. కంబ్యాక్ ఇవ్వడం ఈయన స్టైల్. గత మూడేళ్లలో ఈయన ‘పి.ఎస్.వి.గరుడవేగ’ ‘కల్కి’ వంటి చిత్రాల్లో నటించారు. వీటిలో ‘పి.ఎస్.వి.గరుడవేగ’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా.. రాజశేఖర్ గారు ఆయన కెరీర్లో కొన్ని సూపర్ హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఠాగూర్ :

డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఈ కథను రాజశేఖర్ గారు వదులుకున్నారు.తరువాత మెగాస్టార్ తో వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం.. అది బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది.

2)జెంటిల్మెన్ :

అర్జున్ మార్కెట్ ను పెంచిన సినిమా ఇది.డైరెక్టర్ శంకర్ .. ఈ సినిమా కోసం మొదట రాజశేఖర్ గారినే సంప్రదించారు. కానీ అప్పుడు ఆయన వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో చేయలేకపోయారట.

3)లక్ష్మీ నరసింహా :

‘సామి’ రీమేక్ గా తెరకెక్కిన ఈ సూపర్ హిట్ చిత్రం కూడా రాజశేఖర్ గారు మిస్ చేసుకున్నారు.

4)నేనే రాజు నేనే మంత్రి :

రానా కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. దీనికి కూడా మొదటి ఛాయిస్ రాజశేఖర్ గారే..! అయితే దర్శకుడు తేజకు క్లయిమాక్స్ లో కొన్ని మార్పులు చెయ్యమని కోరారట రాజశేఖర్. ఇక తేజ గారి తిక్క గురించి తెలిసిందే కదా. ఆయన చెయ్యను అన్నారు.

5)హనుమాన్ జంక్షన్ :

మొదట ఈ చిత్రాన్నిమోహన్ బాబు, రాజశేఖర్ ల తో ప్లాన్ చేశారు. కానీ ఇద్దరూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో చెయ్యలేకపోయారు.

6) చంటి :

వెంకటేష్ గారిలోని అద్భుతమైన నటుడిని బయటకు తీసింది ఈ చిత్రం. మొదట రాజశేఖర్ నే అనుకున్నారు. కానీ ఆయన రిజెక్ట్ చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus