ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

  • November 17, 2020 / 05:10 PM IST

నిజానికి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఎవరంటే.. అందరూ పూజా హెగ్డే, రష్మిక మందన, కీర్తి సురేష్, అనుష్క,నయన తార,సమంత , రకుల్ ప్రీత్ సింగ్ .. వంటి వార్ల పేర్లే చెబుతుంటారు. అయితే వాళ్లంతా తెలుగు వాళ్ళేనా? అంటే నూటికి నూరు శాతం కాదనే చెప్పాలి. ‘హీరోయిన్లను మన దర్శకనిర్మాతలు ఎక్కువగా నార్త్ నుండే ఎందుకు తీసుకువస్తారు? మన తెలుగులో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా.. పైగా వాళ్ళ పాత్రకు వాళ్ళే డబ్బింగ్ చెప్పుకోగలరు కూడా.! అయినా… నార్త్ వాళ్ళనే ఎందుకు తీసుకుంటారు? ఇలాంటి ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. అయితే వాటికి కచ్చితంగా ఇది అని సమాధానం చెప్పలేము.

‘గ్లామర్ షో చెయ్యడానికి మన తెలుగమ్మాయిలు రెడీగా ఉండరు’ అని ఓ సమాధానం చెప్పేసి దాటేస్తుంటారు మన దర్శకనిర్మాతలు. వీటిని వ్యతిరేకించేవాళ్ళు కూడా ఉన్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. మన తెలుగు రాష్ట్రాల నుండీ కూడా కొంతమంది సినిమాల్లో హీరోయిన్లుగా రాణించారు. వాళ్లకు మొదట ఇక్కడ అవకాశాలు రాకపోయినా.. మిగిలిన ఇండస్ట్రీల్లో సినిమా అవకాశాలు దక్కించుకుని.. టాప్ హీరోయిన్లు అయ్యి మళ్ళీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 23మంది హీరోయిన్లుగా రాణించారు.మరి మన తెలుగు రాష్ట్రాల నుండీ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళెవ్వరో ఓ లుక్కేద్దాం రండి :

1) సావిత్రి – చిర్రావూరు :

మహానటి సావిత్రి గారిది గుంటూరుకు చెందిన చిర్రావూరు. ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగడమే కాకుండా..ఒకానొక టైములో అప్పటి స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ లతో సమానంగా పారితోషికం అందుకునే వారు.

2) జమున – హంపి :

అప్పటి స్టార్ హీరోయిన్ జామున గారు కూడా తెలుగింటి ఆడపాడుచే. అయితే ఈమె కుటంబసభ్యులు హంపిలో సెటిల్ అయ్యారు. అయినప్పటికీ ఈమె తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.

3) శారద – తెనాలి :

అప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఊర్వశి శారద గారు కూడా తెలుగింటి ఆడపడుచే.! ఈమె గుంటూరు దగ్గర తెనాలికి చెందిన వారు.

4) గౌతమి – నిడదవోలు :

తెలుగుతో పాటు తమిళంలో కూడా హీరోయిన్ గా రాణించిన గౌతమి గారి సొంత ఊరు ఆంద్రప్రదేశ్ కు చెందిన నిడదవోలు.

5) మాధవీ – ఏలూరు :

అప్పటి స్టార్ హీరోయిన్ మాధవీ గారి సొంత ఊరు ఆంధ్రప్రధేశ్ కు చెందిన ఏలూరు అన్న సంగతి చాలా మందికి తెలీదు. ఈమె తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళం సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

6) రోజా – తిరుపతి :

1990 వ సంవత్సరం నుండీ 2000వ సంవత్సరం వరకూ స్టార్ హీరోయిన్ గా రాణించిన రోజా.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు.ఈమె సొంత ఊరు తిరుపతి.

7) రంభ – పెద్దాపురం :

తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ రంభ సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన పెద్దాపురం. ఈమె కూడా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.

8) జయప్రద – రాజమండ్రి :

అప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద గారు కూడా తెలుగింటి ఆడపడుచే..! ఈమె సొంత ఊరు రాజమండ్రి

9) జయసుధ – నిడదవోలు :

సహజనటి జయసుధ సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ కు చెండియాన్ నిడదవోలు అయినప్పటికీ.. ఈమెకు మొదటి ఛాన్స్ ఇచ్చింది మాత్రం తమిళ సినిమా ఇండస్ట్రీనే..!

10) భానుప్రియ :

మరో స్టార్ హీరోయిన్ భానుప్రియ కూడా తెలుగింటి ఆడపడుచే..! ఈమె సొంత ఊరు రంగం పేట.

11) విజయశాంతి – చెన్నై

12) లయ – విజయవాడ

13)సమీరా రెడ్డి – రాజమండ్రి

14) అంజలి – రాజోలు

15) ఐశ్వర్య రాజేష్ – చెన్నై

16) రీతు వర్మ – హైదరాబాద్

17) చాందినీ చౌదరి – వైజాగ్

18) శ్రీ దివ్య – హైదరాబాద్

19) కలర్స్ స్వాతి –విశాఖపట్టణం – రష్యా

20) ఈషా రెబ్బా – హైదరాబాద్

21) ఆనంది – వరంగల్

22) శోభితా ధూళిపాళ – తెనాలి

23) అదితి రావు హైదరి – హైదరాబాద్

24) షాలిని వాడ్నికట్టి – హైదరాబాద్

25) కల్పిక గణేష్ – హైదరాబాద్

26) తేజస్వి మాదివాడ – హైదరాబాద్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus