‘ఆచార్య’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

  • May 6, 2022 / 09:56 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న విడుదలై ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి రాంచరణ్ సహా నిర్మాతగా వ్యవహరించడంతో పాటు… సిద్ధ అనే పాత్రని కూడా పోషించడం జరిగింది. అతనికి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంపై అంచనాలు మొదటి నుండీ భారీగా నమోదవడంతో భారీ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఆ బిజినెస్ కు తగ్గ కలెక్షన్లు అయితే బాక్సాఫీస్ వద్ద నమోదు కావడం లేదు. మొదటి వారంలో.. మొదటి రోజు తప్ప తర్వాత ఏ రోజు కూడా ఈ మూవీ డీసెంట్ కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ‘ఆచార్య’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

నైజాం : 10.71 కోట్లు
సీడెడ్ : 5.94 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.65 కోట్లు
ఈస్ట్ : 3.29 కోట్లు
వెస్ట్ : 3.39 కోట్లు
కృష్ణా : 2.98 కోట్లు
గుంటూరు : 4.16 కోట్లు
నెల్లూరు : 2.75 కోట్లు
——————————————————–
ఏపి + తెలంగాణ : 37.87 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.82 కోట్లు
ఓవర్సీస్ : 4.92 కోట్లు
——————————————————–
వరల్డ్ వైడ్ టోటల్ : 45.61 కోట్లు(షేర్)

‘ఆచార్య’ చిత్రానికి రూ.133.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.134 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.45.61 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.88.39 కోట్లు షేర్ ను రాబట్టాలి. టార్గెట్ అయితే చిన్నది కాదు. చిరు, కొరటాల ఇమేజ్ లను బట్టి మొదటి రోజు ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి కానీ తర్వాత నుండీ దారుణమైన కలెక్షన్లు నమోదు చేస్తూ చరిత్రకెక్కింది ఈ చిత్రం.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus