The Sesso: హాట్ టాపిక్ అయిన ‘ది సెస్సో’ ట్రైలర్‌

గ్రేస్‌గ్రిట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై యష్ రాజ్, మౌపియా గోస్వామి, పూజా రెడ్డి, ఈశ్వర్ ముఖ్యతారాగణం లో యష్ రాజ్ రచన, దర్శకత్వంలో బీఎన్ రవి నిర్మిస్తున్న‘ది సెస్సో’ చిత్రం ట్రైలర్ ఇటీవలే యూట్యూబ్ లో విడుదల అయ్యి తెలుగు ప్రేక్షకులని ఆకర్షించింది.

The Sesso

ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతుంది. ప్రేమలో నమ్మకద్రోహం, అవమానాలతో తనపై తనకు నమ్మకం కోల్పోయిన కార్తీక్ (యష్ రాజ్) అనే యువ ఐటీ ఉద్యోగి, మరోవైపు సమాజం వేసే నిందలు, వేధింపుల వల్ల ఎవరికీ చెప్పుకోలేని బాధలో ఉన్న షమ్రిన్ (మౌపియా గోస్వామి) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వీరిద్దరూ కలుసుకున్నప్పుడు నమ్మకం, ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వంటి భావోద్వేగాలతో కథ ఆసక్తికరంగా సాగుతుంది.

త్వరలోనే థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఇస్తుందని చిత్రబృందం నమ్ముతోంది. ఇటీవల ఈ చిత్రం లోని ‘ఏదో ఏదో’ అనే మొదటి పాట ను విడుదల చేసారు. తర్వాత హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఆకాష్ జగన్నాథ్, అశోక్ యాదవ్ కలిసి ట్రైలర్ ను విడుదల చేసారు. ఇప్పుడు ఆ ట్రైలర్ సోషల్ మీడియా లో హుల్ చల్ చేస్తుంది. అని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus