ఆచార్య సినిమాలో అదే హైలెట్..!

Advertisement

మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ కి రెడీ అయిపోయాడు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో తనదైన స్టైల్లో రఫ్పాడిస్తాడట చిరు. రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడని, ముఖ్యంగా నక్సలైట్ క్యారెక్టర్ సమాజాన్ని ఆలోచించే విధంగా మలిచారని టాక్ వినిపిస్తోంది. దేవాదాయశాఖలో జరిగే అవకతవకలపై ఈసినిమా తెరకెక్కబోతోంది. దీనికోసం నగరశివార్లలో వేసిన టెంపుల్ సెట్ సినిమాకే హైలెట్ గా నిలవబోతోంది. రీసంట్ గా ఈ సెట్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ మెగాస్టార్ అభిమానులతో పంచుకున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఈ టెంపుల్ సెట్ లోనే ఇంటర్వెల్ బ్యాంగ్ చిరిగిపోయేలా ఉంటుందని, దీనికోసం సపరేట్ గా ఒక స్పెషల్ స్టంట్ ని డిజైన్ చేశారని చిత్రయూనిట్ నుంచి సమాచారం తెలుస్తోంది. ఇక్కడే సిద్ధ క్యారెక్టర్ కూడా పరిచయం అవ్వబోతోందని అంటున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రోతో ఈ సీన్ లో హైలెట్ గా ఉండబోతోందట. ఈ ఫైట్ సీన్ సినిమాలో చాలా కీలకంగా మారబోతోందని, ఇక్కట్నుంచే సినిమా కథ కూడా ఛేంజ్ అవుతుందని చెప్తున్నారు. ఆచార్య సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అక్కడ కథ మలుపు తిరిగే సన్నివేశం సినిమాకే హైలెట్ గా నిలవబోతోంది. ఇక్కడే సిద్ధ క్యారెక్టర్ మెగాస్టార్ క్యారెక్టర్ ని ఇన్స్ పైయిర్ చేసే విదంగా ఉంటుందని చెప్తున్నారు.

ఈ సినిమాలో గవర్నమెంట్ ఉద్యోగిగా మెగాస్టార్ కనిపిస్తూనే మరోకోణంలో ఫ్లాష్ బ్యాక్ లో నక్సలైట్ గా కనిపిస్తాడని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన మరోసారి కాజల్ ఆడిపాడనుంది. అంతేకాదు, ప్రత్యేకమైన సాంగ్ లో రెజీనా మెగాస్టార్ తో కలిసి స్టెప్పులు వేయబోతోంది. ఇక ఈ సినిమా కోసం చిరంజీవి బరువు తగ్గిన సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video


మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news