మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న ఆచార్య మూవీ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ధర్మస్థలి అనే ఓ పురాతన ద్వారం వద్ద రౌడీలను చెండాడుతున్న చిరంజీవి లుక్ కి విశేష ఆదరణ దక్కింది. ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఐతే మోషన్ పోస్టర్ విడుదల తరువాత సినిమా కథపై కాపీ ఆరోణపణలు మొదలయ్యాయి. కొందరు రచయితలు ఆచార్య మూవీ కథ మాది అంటూ స్టేట్మెంట్స్ విడుదల చేశారు.
ఆచార్య చిత్ర యూనిట్ అనుమతి లేకుండా మా కథను వాడుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. వరుసగా వస్తున్న కాపీ ఆరోపణలకు ఆచార్య చిత్ర నిర్మాతలు స్పందించారు. ఆచార్య చిత్రాన్ని నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఓ అధికారిక లెటర్ విడుదల చేయడం జరిగింది. ఆ లెటర్ లో ఆచార్య మూవీ కథ కేవలం దర్శకుడు కొరటాల శివ రాసిందన్నారు. అలాగే ఈ మూవీ కథ ఆచార్య యూనిట్ సభ్యులలో ముఖ్యులకు మాత్రమే తెలుసు.
కేవలం మోషన్ పోస్టర్ చూసి, కథను అంచనా వేయడం సరికాదు అన్నారు. ప్రింట్ మీడియాలో ఆచార్య మూవీ కథపై వస్తున్న వార్తల ఆధారంగా కథ మాదే అనే అభిప్రాయానికి రాకూడదు అన్నారు. ఇంకా విడుదల కానీ సినిమా కథపై ఎదో ఊహించుకొని కొరటాల శివ లాంటి దర్శకుల గౌరవానికి భంగం కలిగించకండి అని కోరడం జరిగింది.
1
2