ఓవర్సీస్ లో దుమ్మురేపుతున్న మెగాస్టార్..!

  • February 5, 2021 / 07:34 PM IST

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పార్ట్ అంతా ఫినిష్ చేసే దిశలో ఉంది ఈ సినిమా. అంతేకాదు, మే 13వ తేదిన రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసరికి ఇప్పుడు జోరుగా బిజినెస్ కూడా అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి మార్కెట్ ఏంటో మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలో ఈ సినిమాకి వస్తున్న ఫ్యాన్సీ ఆఫర్లు చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అంటున్నారు అందరూ.

మెగాస్టార్ చిరంజీవికి నైజాం లో చాలా మంచి మార్కెట్ ఉంటుంది. ఇక్కడ అందుకే ఎక్కువ రేటు రాబట్టాలని చూస్తున్నారు. కొన్ని ఏరియాల్లో కొరటాల శివ సొంతంగా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పుడు మెగస్టార్ కి ఓవర్సీస్ మార్కెట్ నుంచీ ఫ్యాన్సీ రేటు పలుకుతోందని చెప్తున్నారు. అక్కడ చాలా భారీ టార్గెట్ ఫిక్స్ చేస్కున్నారట మేకర్స్. సైరా సినిమాకి ఓపెనింగ్ భీభత్సంగా వచ్చాయి. అలాగే, ఖైదీ నెంబర్ 150కి కూడా ఓపెనింగ్స్ ఇరగదీశాయి.

అందుకే, ఇప్పుడు మెగాస్టార్ ఆచార్య కి ఓవర్సీస్ లో భారీ రేటు పలికే అవకాశం కనిపిస్తోంది. అక్కడ మార్కెట్ దుమ్మురేపుతాడనే అంటున్నారు. అయితే రేటు ఎంత పలుకుతోంది..? ఏ స్టూడియోస్ రిలీజ్ చేయబోతున్నాయనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus