సినిమాలు ఎందుకు చేయడం లేదు? అనడిగితే హేమ ఏం చెప్పిందంటే!..

  • February 11, 2023 / 04:52 PM IST

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్టార్ స్టేటస్ దక్కించుకుంది హేమ.. పలు సూపర్ హిట్ సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి తెలుగు ప్రేక్షకులను అలరించింది. హాస్యబ్రహ్మ బ్రహ్మానందంతో ఆమెది క్రేజీ కాంబినేషన్..‘అతడు’, ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి ఎన్నో మూవీస్‌లో వీరి జోడీ ఆకట్టుకుంటుంది. దాదాపు స్టార్ హీరోలతో పాటు ఈ జెనరేషన్ కథానాయకులందరితోనూ యాక్ట్ చేసింది హేమ..ఇక ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్) ఎన్నికల్లో యాక్టివ్‌గా పార్టిసిపెట్ చేసింది. గత ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి తర్వాత విరమించుకుంది.

ఆ టైంలో మీడియా ముందు ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. హేమ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె భర్త జాన్ కెమెరామెన్.. వీరికి ఓ కుమార్తె ఉంది. క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీగా సినిమాలు చేస్తుండే హేమ.. కొద్ది కాలంగా తెలుగు తెరపై కనిపించడం లేదు. ఈ సందర్భంగా కొందరు మీడియా వారు హేమను ‘‘ఈ మధ్య సినిమాల్లో నటించడం లేదు ఏంటి మేడమ్’’ అని అడిగారు.. దానికి హేమ.. ‘‘నేను కూడా కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేశాను..

Actor HemaActress HemaHema

అందులో సంపాదన ఎక్కువ అవడంతో.. సుఖ పడటం అలవాటు అయిపోయింది.. అందుకే కష్టపడాలని అనిపించడం లేదు’’ అంటూ సెటైరికల్‌గా ఆన్సర్ ఇచ్చింది.. హేమ సమాధానం విని అక్కడున్న వారు షాక్ అవడంతో పాటు ఆశ్చర్యపోయారు కూడా.. ‘‘అంతలా ఇన్‌కమ్ వచ్చే బిజినెస్‌ ఏంటబ్బా?’’ అని ఆలోచనలో పడ్డారు.. ఇంతకీ ఏం బిజినెస్ అని కూడా అడిగారు.. ఈ ప్రశ్నకు కూడా తన స్టైల్లో సమాధానం చెప్పి మళ్లీ ఇంకో షాక్ ఇచ్చిందామె.. నేను ఏం బిజినెస్ చేస్తున్నాను..

దానికి సంబంధించిన వివరాలన్నీ మరో ఇంటర్వ్యూలో చెబుతానంటూ సమాధానం దాటవేసింది.. ఇక ఇటీవల నెల్లూరు చేపల పులుసు వ్యాపారం ప్రారంభించిన కిరాక్ ఆర్పీ మంచి కోరేవారిలో తాను ముందు వరుసలో ఉంటానని చెప్పుకొచ్చింది హేమ. అంతేకాక, అందరూ బావుండాలి.. అందులో మనం ఉండాలి అనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతాను అని కూడా చెప్పుకొచ్చింది.. అయితే హేమ మాటలు విన్న వారికి ఆమె వెటకారంగా అందాట?.. లేక నిజంగానే ఏమైనా వ్యాపారం ప్రారంభించిందా?.. అనేది అర్థం కావట్లేదు..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus