ఓవర్సీస్ లో తెలుగు సినిమాలకు చాలా డిమాండ్ ఉంది. అక్కడ కూడా మన సినిమాలు మిలియన్ల డాలర్ల వర్షం కురిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా అద్భుతాలు చేసిన చరిత్ర ఉండనే ఉంది.పెద్ద సినిమాలు $20, $25 టికెట్ రేట్లతో ఆ అద్భుతాలు చేస్తే… కొన్ని చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు $14 డాలర్ల టికెట్ రేట్లకే మిలియన్ల కొద్దీ డాలర్ల వర్షం కురిపించాయి. ఒకప్పుడు ఓవర్సీస్ ఆడియన్స్ రివ్యూలు, రేటింగ్ లు చూసి సినిమాలకు వెళ్దామా వద్దా అని డిసైడ్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. కాస్త బజ్ ఉన్న సినిమా ఏది వస్తుందని తెలిసినా రిలీజ్ టైంలోనే చూసేస్తున్నారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి. ఓవర్సీస్ లో మరీ ముఖ్యంగా యూఎస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాలీవుడ్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) బాహుబలి2 :
ప్రభాస్ – రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం.. యూ.ఎస్.లో ఏకంగా $20 మిలియన్ డాలర్లను వసూల్ చేసిన సినిమాగా నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. ఈ మూవీ అక్కడ ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
2) ఆర్.ఆర్.ఆర్ :
రాజమౌళి- రాంచరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ యూ.ఎస్.లో ఏకంగా $14.3 మిలియన్ డాలర్లను వసూల్ చేసి రికార్డు సృష్టించింది.ఈ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
3) బాహుబలి ది బిగినింగ్ :
రాజమౌళి- ప్రభాస్- రానా కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ఒక్క తెలుగు వెర్షన్ తోనే యూ.ఎస్లో $6.9 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది. ఈ మూవీ అక్కడ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
4) అల వైకుంఠపురములో :
త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన ఈ మూవీ యూ.ఎస్.లో ఏకంగా $3.6 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది. ఈ మూవీ అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
5) రంగస్థలం :
సుకుమార్ – రాంచరణ్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ యూ.ఎస్.లో $3.5 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది. ఈ మూవీ అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
6) భరత్ అనే నేను :
మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ యూ.ఎస్.లో $3.4 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది. ఈ మూవీ అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది.
7) సాహో :
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ యూ.ఎస్.లో $3.2 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది. కానీ ఇది పెద్ద డిజాస్టర్ అయ్యింది.
8) శ్రీమంతుడు :
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ యూ.ఎస్.లో $2.8 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది. ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
9)సైరా నరసింహారెడ్డి :
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ యూ.ఎస్.లో $2.6 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది. కానీ ఈ మూవీ అక్కడ యావరేజ్ ఫలితాన్నే అందుకుంది.
10) మహానటి :
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక్క యూ.ఎస్.లోనే $2.5 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని స్వప్న సినిమా బ్యానర్ పై అశ్వినీ దత్ కూతుర్లు నిర్మించారు. దివంగత సూపర్ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న సావిత్రి గారి జీవిత కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.