Actor Krishnudu: రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కృష్ణుడు!

  • September 4, 2021 / 01:51 PM IST

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన కృష్ణుడు పేకాట ఆడుతున్న కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసులు కృష్ణుడితో పాటు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శిల్పా పార్క్ విల్లాలో కొంతమంది పేకాట ఆడుతున్నారనే సమాచారం రావడంతో పోలీసులు శిబిరంపై దాడి చేసి కృష్ణుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం ద్వారా పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారని తెలుస్తోంది.

పోలీసులు పేకాట ఆడుతున్న గ్యాంగ్ నుంచి 1,97,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ హీరోగా కృష్ణుడు గుర్తింపును సంపాదించుకున్నారు. వినాయకుడు సినిమాతో కృష్ణుడు హీరోగా సక్సెస్ సాధించారు. కృష్ణుడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. హ్యాపీడేస్, యువత, ఆర్య2, జ్యోతిలక్ష్మి సినిమాలు కృష్ణుడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్లలో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడు పెద్దిరాజు కూడా ఉన్నారని సమాచారం.

ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. కృష్ణుడు ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో కొనసాగుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కృష్ణుడితో పాటు అరెస్ట్ చేసిన వాళ్లను కోర్టుకు తరలించి అక్కడినుంచి రిమాండ్ కు తరలించినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో కృష్ణుడికి ఆఫర్లు తగ్గగా పేకాట కేసులో చిక్కుకుని కృష్ణుడు వార్తల్లో నిలవడం గమనార్హం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus