గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!

ఓ హిట్ సినిమాని రీమేక్ చేయడం అంటే అంత ఈజీ మేటర్ ఏమీ కాదు. కథ మాత్రమే రెడీగా ఉంటుంది. కానీ నేటివిటీకి తగినట్టు మార్పులు చేయాలి. అలాగే ఒరిజినల్ లో ఉన్న థీమ్ మిస్ అవ్వకూడదు. దాంట్లో పొరపాటు జరిగితే సినిమా ఫలితం తేడా కొట్టేస్తుంది అనడంలో సందేహం లేదు. అలాగే రీమేక్ లోని పాత్రలని ఓన్ చేసుకునే నటులను ఎంపిక చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇదిలా ఉండగా గత 5 ఏళ్లలో అంటే… 2016 నుండీ 2021 వరకు తెలుగు రీమేక్ అయ్యి సూపర్ హిట్ సాధించిన రీమేక్ లు కొన్ని ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1)ఊపిరి :

ఇంటచబుల్స్ అనే ఫ్రెంచ్ మూవీ రీమేక్ ఇది. నాగార్జున, కార్తీ లు హీరోలుగా నటించిన ఈ చిత్రం 2016 వ సంవత్సరం మార్చిలో విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు.

2)ప్రేమమ్ :

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమమ్’ ను అదే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేశారు. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. చందూ మొండేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.

3)ధృవ :

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తని ఒరువన్’ కి ఇది రీమేక్. రాంచరణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసాడు. ఇది కూడా హిట్ అయ్యింది.

4)ఖైదీ నెంబర్ 150 :

చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ ఇది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ మూవీకి ఇది రీమేక్. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకుడు.

5)గురు :

తమిళంలో ‘ఇరుది సుట్రు’,హిందీలో ‘షాలా కడూస్’ వంటి చిత్రాలకి రీమేక్ గా తెరకెక్కిన చిత్రమిది. వెంకటేష్,రితిక సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

6)యూ టర్న్ :

సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఓ కన్నడ రీమేక్. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

7)ఎవరు :

బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘బద్లా’ కి ఇది రీమేక్. అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

8) ఓ బేబీ :

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ‘మిస్ గ్రానీ’ కి రీమేక్. తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యింది ఓ బేబీ మూవీ..!నందినీ రెడ్డి ఈ చిత్రానికి డైరెక్టర్.

9)గద్దలకొండ గణేష్ :

తమిళంలో వచ్చిన ‘జిగర్తాండ’ కి ఇది రీమేక్. వరుణ్ తేజ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ తెలుగులో బాగానే కలెక్ట్ చేసింది.

10)రాక్షసుడు :

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాట్ససన్’ కు ఇది రీమేక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకుడు. తెలుగులో కూడా ఇది మంచి విజయాన్నే నమోదు చేసింది.

11)వకీల్ సాబ్ :

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ కు ఇది రీమేక్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు.

12) నారప్ప :

ఇది రీసెంట్ హిట్. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ కు రీమేక్. వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus