ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు హఠాత్తుగా మరణిస్తున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. తాజాగా రాధికా మాజీ భర్త, ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన ప్రతాప్ పోతెన్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.చెన్నైలో ఉన్న తన నివాసంలోనే ఆయన మరణించినట్లు సమాచారం అందింది. అయితే ప్రతాప్ పోతెన్ మరణించడానికి ముందు తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మరణం పై ఈ పోస్టులు సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
గురువారం రోజున ఉదయం 9:38 గంటలకు జార్జ్ కార్లిన్ కోట్తో కూడిన ఫొటో ఆయన పోస్ట్ చేసి ‘చాలా కాలంగా కొద్ది కొద్దిగా లాలాజలం మింగడం వలన మరణం సంభవిస్తుంది’ అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు ‘ఒక సమస్యని రూట్ లెవెల్లో సాల్వ్ చేయకుండా దాని లక్షణాలకు మాత్రం చికిత్స అందినప్పుడు మీరు ఫార్మసీపై ఆధారపడటం ప్రారంభిస్తారు’ అంటూ మరో పోస్ట్ పెట్టారు పోతెన్. అలాగే ‘జీవితం అనేది ఒక ఆట అనుకుంటే అందులో ప్రతీ జనరేషన్ ఒకేలా ఆడుతుంది’ అంటూ కూడా ఆయన మరణించడానికి 15 గంటల ముందు ఓ పోస్ట్ పెట్టారు.
ఇలా చాలా విధాలుగా పోస్టులు పెట్టారు పోతెన్. దీంతో ఆయన మరణం పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతాప్ పోతెన్ సీనియర్ నటి రాధిక మాజీ భర్త. 1985వ సంవత్సరంలో వీరి పెళ్లి జరిగింది.కానీ ఏడాదిలోపే అంటే 1986 లో విడాకులు తీసుకున్నారు. అటు తర్వాత ఆయన అమల సత్యనాద్ అనే మరో మహిళను వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది. 22 ఏళ్ల తర్వాత ఆమెతో కూడా విడాకులు తీసుకున్నారు ప్రతాప్.
తెలుగులో నాగార్జున హీరోగా నటించిన ‘చైతన్య’ చిత్రానికి దర్శకత్వం వహించారు ప్రతాప్ పోతెన్. 1991 లో ఆ చిత్రం రిలీజ్ అయ్యింది. కానీ ఆ మూవీ సక్సెస్ కాలేదు.అందుకే తెలుగులో ఆయన దర్శకుడిగా కొనసాగలేక పోయారు. సిద్ధార్థ నటించిన ‘చుక్కల్లో చంద్రుడు’, నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో ఈయన నటించారు.అలాగే ఈయన నటించిన ‘గ్రే’ చిత్రం కూడా రిలీజ్ కావాల్సి ఉంది.
1
2
3
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!