ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

2022 వ సంవత్సరంలోకి అడుగుపెట్టి అప్పుడే 6 నెలలు పూర్తయిపోవడం.. 7 వ నెల కూడా సగం పూర్తయిపోవడం జరిగింది. కరోనా కారణంగా రెండేళ్ళు రిలీజ్ కి నోచుకోని పెద్ద సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఇండియన్ బాక్సాఫీస్ కళకళలాడి పోయింది. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, జూన్ నెలల్లో 3 ఇండస్ట్రీ హిట్లు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది విడుదలైన సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది. అన్ని ఇండస్ట్రీల్లోనూ కలుపుకుని 600 కి పైగా సినిమాలు రిలీజ్ అయితే హిట్ అయిన సినిమాల సంఖ్య 50 కూడా లేదు.

జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. దానికి కారణాలు సవా లక్ష ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ప్రఖ్యాత ఇంటర్నెట్ మూవీ డేటాబేస్(ఐ.ఎం.డి.బి) సంస్థ సినిమాలకు ఇచ్చే రేటింగ్స్ పై ప్రేక్షకులకు నమ్మకం ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ లెక్కలు బట్టి.. ఈ సంస్థ లో ఎక్కువ రేటింగ్ పడదు.కంటెంట్ మరియు ప్రేక్షకులను ఆ సినిమా ఎంత వరకు ఎంటర్టైన్ చేసింది అనేదానిని పరిగణలోకి తీసుకుని మంచి రేటింగ్ నమోదవుతూ ఉంటుంది. మరి ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ప్రథమార్థంలో వచ్చిన టాప్ 10 రేటింగ్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) విక్రమ్‌ :

కమల్ హాసన్ హీరోగా విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం 8.8/10 ఐ.ఎం.డి.బి రేటింగ్ ను సాధించి నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది.

2) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 :

ప్రశాంత్ నీల్ యష్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం 8.5/ 10 ఐ.ఎం.డి.బి రేటింగ్ ను సాధించి నెంబర్ 2 ప్లేస్ లో నిలిచింది.

3) ది కశ్మీర్ ఫైల్స్ :

‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ వారు నిర్మించిన ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 8.3/ 10 ఐ.ఎం.డి.బి రేటింగ్ ను సాధించి టాప్ 3 ప్లేస్ ను దక్కించుకుంది.

4) హృదయం :

ఈ మలయాళం మూవీ 8.1/10 ఐ.ఎం.డి.బి రేటింగ్ ను సాధించి టాప్ 4 ప్లేస్ లో నిలిచింది.

5) ఆర్.ఆర్.ఆర్ :

రాజమౌళి- ఎన్టీఆర్- రాంచరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం 8/10 ఐ.ఎం.డి.బి రేటింగ్ ను సాధించి టాప్ 5 ప్లేస్ లో నిలిచింది.

6) ఎ థర్స్‌డే :

యామి గౌతమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం 7.8/10 ఐ.ఎం.డి.బి రేటింగ్ ను సాధించి టాప్ 6 ప్లేస్ లో నిలిచింది.

7) ఝండ్‌:

అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం 7.4/10 ఐ.ఎం.డి.బి రేటింగ్ ను సాధించి టాప్ 7 ప్లేస్ లో నిలిచింది.

8) సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ :

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం 7.2/10 ఐ.ఎం.డి.బి రేటింగ్ ను సాధించి టాప్ 8 ప్లేస్ ను దక్కించుకుంది.

9) రన్‌వే 34 :

అజయ్ దేవగన్, అమితాబ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం 7.2/10 ఐ.ఎం.డి.బి రేటింగ్ ను సాధించి టాప్ 9 ప్లేస్ ను దక్కించుకుంది.

10) గంగూబాయి కతియావాడి :

అలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 7/10 ఐ.ఎం.డి.బి రేటింగ్ ను సాధించి టాప్ 10 లో నిలిచింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus