రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!

చాలా కాలం నుండి టాలీవుడ్లో ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. చాలా మందికి అది తెలిసిందే. మొదటి సినిమాతో హిట్టు కొట్టిన దర్శకులకు రెండో సినిమా ప్లాప్ అవుతుంది అనేది ఆ సెంటిమెంట్. ఇప్పటివరకు చాలా మంది దర్శకుల విషయంలో ఆ సెంటిమెంట్ నిజమైంది.అలా అని మొదటి సినిమా ప్లాప్ అయినంత మాత్రాన దుకాణం సర్దేస్తారు అని కాదు.రెండో సినిమా ప్లాప్ అయినా స్టార్ డైరెక్టర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రెండో సినిమాతో హిట్టు కొట్టిన డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు.

ఆ లిస్ట్ లో రాజమౌళి,త్రివిక్రమ్, కొరటాల శివ,బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, సంపత్ నంది ,వెంకీ కుడుముల వంటి వారు ఉన్నారు. అయితే కొంతమంది యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లు మొదటి సినిమాతో మంచి హిట్లు కొట్టి.. కచ్చితంగా రెండో సినిమాతో కూడా హిట్టు కొట్టి.. ఆ ప్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది. ప్లాప్ సెంటిమెంటే రిపీట్ అయ్యింది. ఆ దర్శకులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) సుజీత్ :

మొదటి చిత్రం ‘రన్ రాజా రన్’ తో హిట్ అందుకున్న సుజీత్.. రెండో చిత్రమైన ‘సాహో’ తో పెద్ద డిజాస్టర్ మూటగట్టుకున్నాడు.

2) కరుణ్ కుమార్ :

‘పలాస’ చిత్రంతో మంచి హిట్ ను అందుకున్న దర్శకుడు కరుణ్ కుమార్… రెండో చిత్రంగా సుధీర్‌ బాబుతో ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ ను తెరకెక్కించాడు. మధ్యలో గ్యాప్ వస్తే ‘మెట్రో కథలు’ అనే ఓటీటీ ప్రాజెక్టు చేశాడు కానీ.. రెండో చిత్రం గా ‘శ్రీదేవి సోడా సెంటర్’ నే పరిగణించాలి. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

3) అజయ్ భూపతి :

‘ఆర్‌.ఎక్స్‌ 100’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి… శర్వానంద్,సిద్దార్థ్ లతో చేసిన ‘మహాసముద్రం’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇది కనుక హిట్ అయితే అతను స్టార్ డైరెక్టర్ అయిపోయుండేవాడు.

4) తేజ మార్ని :

‘జోహార్’ చిత్రంతో ఓటీటీలో హిట్ అందుకుని టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న దర్శకుడు తేజ మార్ని.. రెండో చిత్రం ‘అర్జున ఫల్గుణ’ తో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు.

5) రాధా కృష్ణ కుమార్ :

యాక్షన్ హీరో గోపీచంద్‌ తో ‘జిల్‌’ వంటి యాక్షన్‌ ఎంటర్టైనర్ ను రూపొందించిన రాధా కృష్ణ.. డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇతని రెండో సినిమా ‘రాధే శ్యామ్’. ప్రభాస్‌ వంటి పాన్ ఇండియా హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే అతని ఇమేజ్ కు మ్యాచ్ కాని లవ్ స్టోరీని తెరకెక్కించి డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు.

6) స్వరూప్‌ ఆర్‌.ఎస్‌.జె :

నవీన్‌ పొలిశెట్టి తో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన స్వరూప్… తన నెక్స్ట్ చిత్రంగా తాప్సి తో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ చేశాడు.ఈ చిత్రం ప్లాప్ అయ్యింది.

7) ప్రశాంత్ వర్మ :

‘అ!’ చిత్రంతో మంచి హిట్ ను అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ రెండో చిత్రం ‘కల్కి’ తో నిరాశపరిచాడు.

8) వెంకీ అట్లూరి :

‘తొలిప్రేమ’ తో సాలిడ్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. రెండో సినిమా ‘మిస్టర్ మజ్ను’ తో నిరాశపరిచాడు.

9) కె.వి.గుహన్ :

తమిళంలో ఈయన డైరెక్టర్ గా సినిమాలు చేశాడు కానీ.. తెలుగులో డైరెక్టర్ గా చేసిన మొదటి చిత్రం ‘118’. ఇది డీసెంట్ హిట్ అందుకుంది. కానీ రెండో సినిమా ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ నిరాశపరిచింది.

10) రితేష్ రానా :

‘మత్తు వదలరా’ చిత్రంతో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రితేష్ రానా.. ఆ చిత్రంతో చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. కానీ రెండో సినిమా ‘హ్యాపీ బర్త్ డే’ నిరాశపరిచింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus