Godfathe: చిరు తండ్రిగా సీనియర్ నటుడు.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • October 7, 2022 / 06:15 PM IST

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నయనతార నటించారు. ఇక వీరిద్దరికీ తండ్రి పాత్రలో నటించిన నటుడు మనకు ఎంతో సుపరిచితమే.ప్రస్తుత జనరేషన్ లో ఉన్నవారికి ఈయన తెలియకపోయినప్పటికీ ఈ నటుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం.

ఇంతకీ గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి, నయనతారకు తండ్రిగా నటించిన నటుడు ఎవరు అనే విషయానికి వస్తే ఈయన 1986లో దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాఎథ్ తెరకెక్కించిన సిరివెన్నెల సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో నటి సుహాసినితో కలిసి సర్వదామన్ ఎంతో అద్భుతంగా నటించారు. ఇందులో ఈయన అందుడి పాత్రలో నటించి సందడి చేశారు. ఈ విధంగా సర్వదామన్ అందుడి పాత్ర ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఇక ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ శ్రోతల చెవిలో మారుమోగుతూ ఉంటాయి. అంత అద్భుతమైన పాటలను అందించిన పాటల రచయిత సీతారామశాస్త్రి గారికి ఈ సినిమా తరువాత ఆయన పేరు ముందు సిరివెన్నెల అని పేరు రావడంతో ఈయన తన పేరును సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మార్చుకున్నారు.

ఈ విధంగా 35 సంవత్సరాల క్రితం తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి సర్వదామన్ తిరిగి మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా చాలాకాలం తర్వాత ఈయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus