‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్’ సీజన్ 3 లో వితిక -వరుణ్.. కపుల్ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు. హౌస్ లో వీరిద్దరి రొమాన్స్, గొడవలు, ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం వంటివి అందరినీ అలరించాయి. అలాంటి షోకి వెళ్లి కూడా వీళ్ళు ఎటువంటి గొడవలు పడకుండా రావడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.మళ్ళీ మూడు సీజన్ల తర్వాత మరో కపుల్ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళే రోహిత్ అండ్ మెరీనా..! సీరియల్స్ ఎక్కువగా చూసే వాళ్లకు వీళ్ళను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.వీళ్ళ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) గోవాలోని క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది మెరీనా అబ్రహం. జూన్ 12న ఈమె పుట్టినరోజు. ఏ సంవత్సరం అనేది బయటకు రాలేదు.

2) 2016 లో వచ్చిన ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’ అనే తెలుగు చిత్రంతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ‘సబ్ కా దిల్ ఖుష్’ అనే హిందీ చిత్రంలోనూ ఈమె నటించింది. 2017 టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ అవార్డుల్లో ఈమె ఒకరిగా నిలిచింది.

3) సినిమాల్లో క్లిక్ అవ్వకపోవడంతో సీరియల్స్ లో నటిస్తూ వస్తోంది మెరీనా. ‘అమెరికా అమ్మాయి’ సీరియల్‌లో సమంతా కళ్యాణిగా ప్రేక్షకుల్ని మెప్పించింది. అటు తర్వాత ‘ఉయ్యాల జంపాలా’ సీరియల్‌ లో కూడా నటించి మెప్పించింది.

4) 2017 నవంబర్‌లో మెరీనా.. తన సహ నటుడు మోడల్ అయిన రోహిత్ షహ్‌నీ ని పెళ్లి చేసుకుంది. పెళ్ళైన తర్వాత మెరీనా హైదరాబాద్ లోనే ఉంటూ వస్తోంది.

5) రోహిత్ ఒక మోడల్ మాత్రమే కాదు సీరియల్ నటుడు కూడా..! పలు సీరియల్స్ తో ఇతను బాగా పాపులర్ అయ్యాడు. ‘నీలి కలువలు’, ‘అభిలాష’ వంటి సీరియల్స్‌ ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2015లో చిరు గొడవలు అనే సినిమాలో కూడా హీరోగా నటించాడు.

6) రోహిత్&మెరీనాలు ‘డాన్స్ జోడి డాన్స్‌’లో కూడా పార్టిసిపేట్ చేశారు.

7) యూట్యూబ్‌ లో కూడా కొన్ని వీడియాలతో ఈ జంట సందడి చేస్తూనే ఉంటుంది.

8) మెరీనా అత్తగారి పేరు రేణు సాహ్ని, మరిది పేరు హిమాన్షు సాహిని. హిమాన్షు ఒక వి.ఎఫ్.ఎక్స్ ఆర్టిస్ట్ అలాగే ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్.

9) మెరీనా తన చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. ఆమె తల్లి జూలియానా అబ్రహం ఓ ఇంగ్లీష్ టీచర్.తర్వాత హైదరాబాద్లోని ఓ స్కూల్ లో ప్రిన్సిపాల్ గా కూడా చేసింది.

10) ఈ జంటకి కాస్త బ్రేక్ దొరికితే స్విజర్లాండ్ కు చెక్కేస్తుంటారు. హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే ఈ జంట చేసే మొదటి పని ఇదే అంటూ వీళ్ళు చెప్పుకొచ్చారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus