ఒకప్పటి స్టార్ హీరోలు ఇప్పుడు ప్రత్యేక పాత్రలతో అకట్టుకుంటున్నారు. తమిళ చిత్రపరిశ్రమ లో ప్రముఖ నటుడుగా ఉన్న సుప్రీం స్టార్ శరత్ కుమార్ మళ్ళీ బిజీ నటుడిగా మారిపోయారు. ఏకంగా 20 చిత్రాల్లో నటించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తాజాగా విడుదలైన ‘రుద్రన్’ లో భూమి అనే విలన్ పాత్ర, ‘పొన్నియిన్ సెల్వన్-2’లో పెరియ పళువేట్టైయార్ పాత్రలో ఆయన నటించారు. ఈ రెండు పాత్రలు ఆయన నటనకు అద్దంపట్టాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాల తర్వాత ఆయన కమిట్ అయిన ప్రాజెక్టుల గురించి తెలిపేందుకు తాజాగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కొంతకాలం పాటు సినిమా రంగానికి దూరంగా ఉన్నా. ఇప్పుడు రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నా. ‘పొన్నియిన్ సెల్వన్-2’ చిత్రం ప్రమోషన్‌లో నేను పాల్గొనలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రమోషన్లకు నన్ను కూడా ఆహ్వానించారు. కానీ చెన్నైలో లేకపోవడంతో హాజరుకాలేదు. ‘పీఎస్’ (PS)లో ఒక పాత్రలో అవకాశం కల్పించినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ‘వారిసు’ ద్వారా నేటి యువతరానికి నన్ను పరిచయం చేసిన హీరో విజయ్ , దర్శకుడు వంశీకి కృతజ్ఞతలు. ‘రుద్రన్’లో విలన్‌గా చేయాలని ఆఫర్ వచ్చినపుడు కాస్త వెనుకంజ వేశా.
కానీ, ఇపుడు అనేక మంది హీరోలు ప్రతినాయకులుగా రాణిస్తున్నారు. విలన్ వేషం వేయడాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ పాత్రకు న్యాయం చేశారా లేదా అన్నదే చూస్తున్నారు. అందుకే ధైర్యం చేశా. నేను హీరోగా ఉన్నప్పటి కంటే ఇప్పుడే అధిక చిత్రాల్లో నటిస్తున్నా. ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు ఇలా సినిమా అనే చక్రంలో బొంగరంలా తిరుగుతున్నానని శరత్ కుమార్ అన్నారు. (Sharath Kumar) ఆయన నటించబోయే ప్రాజెక్టులు శరవేగం పూర్తి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా