Shivaji: అలా మాట్లాడటం వల్ల శత్రువులు ఏర్పడ్డారు.. శివాజీ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన శివాజీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మొదట ఎడిటర్ గా జాయిన్ అయ్యానని ఆ సమయంలో ఏం చేయాలో కూడా తెలియదని శివాజీ తెలిపారు. ఇంటర్ లో బైపీసీ అని జువాలజీ ఫెయిల్ అయ్యానని మా నాన్న నేను డాక్టర్ కావాలని కోరుకున్నారని ఆయన కామెంట్లు చేశారు. మా నాన్నను చాలా మిస్ అవుతున్నానని శివాజీ తెలిపారు.

రామారావు గారంటే మహా పిచ్చి ఉండేదని లవకుశ సినిమాను మా ఊరిలో ఎక్కువగా ప్రదర్శించారని ఆయన పేర్కొన్నారు. కాలేజ్ కు వచ్చిన తర్వాత చిరంజీవిపై అభిమానం ఏర్పడిందని శివాజీ చెప్పుకొచ్చారు. కాదంబరి కిరణ్ గారు నేను తినడానికి, ఉండటానికి సహాయం చేశారని ఆయన తెలిపారు. జీవీ సుబ్బయ్య అనే వ్యక్తి ఎడిటింగ్ నేర్పించారని శివాజీ వెల్లడించడం గమనార్హం.

జెమిని టీవీలో బెక్కం వేణుగోపాల్ పరిచయం అయ్యారని ఆయన తెలిపారు. (Shivaji) నేను హైదరాబాద్ కు వచ్చిన సమయంలో ఫిల్మ్ నగర్ లో గజం 2,000 రూపాయలు అని శివాజీ పేర్కొన్నారు. విధిని ఎవరూ మార్చలేరని ఆయన కామెంట్లు చేశారు. నిజం అనేది ప్రాక్టికల్ గా అనుభవిస్తే మాత్రమే తెలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. నేను మాట్లాడేది నచ్చొచ్చు నచ్చకపోవచ్చని శివాజీ కామెంట్లు చేశారు.

రాఘవేంద్రరావు గారు ఒక సందర్భంలో నీ పళ్లు కొంచెం సెట్ చేయించుకోగలవా అని అన్నారని ఆ కామెంట్ తో నాకు భయం వేసిందని శివాజీ తెలిపారు. బిగినింగ్ డేస్ లో నేను రఫ్ గా మాట్లాడటం వల్ల నాకు తెలియని శత్రువులు ఏర్పడ్డారని ఆయన కామెంట్లు చేశారు. శివాజీ టాలీవుడ్ లో మళ్లీ నటుడిగా బిజీగా కావాలని అనుకుంటున్నారు కెరీర్ విషయంలో శివాజీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. టాలీవుడ్ డైరెక్టర్లు శివాజీకి ఆఫర్లు ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus