సినీ ఇండస్ట్రీ లో కాంట్రవర్సిస్ అనేవి చాలా సాధారణం. పెద్ద సినిమాలు వస్తున్నాయంటే చాలు ఏదో వివాదం రాచుకునే ఉంటుంది. సినిమా టైటిల్స్ నుంచి.. పాడిన పాటల వరకు కాంట్రవర్సీలు వస్తున్నాయి. పలు చిత్రాల్లోని కొన్ని సన్నివేశాల వల్ల వివాదాలు వస్తు ఉండటం తో వాటిని డిలీట్ చేసి మూవీస్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఉన్న కొన్ని మూవీల గురించి తెలుసుకుద్దాం.
1. సైరా నరసింహారెడ్డి
మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా’ సినిమా గురించి కూడా వివాదాలు తెగ చుట్టుముట్టాయి. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి’ గురించి చాలా విషయాలు తెలుసుకొని వారికి ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదని నరసింహ రెడ్డి గారి కుటుంబ సభ్యలు ఆరోపించారు, కొణిదెల ఆఫీస్ దగ్గర, చిరు ఇంటి ముందు ధర్నాలు కూడా చేసారు. చివరికి ఈ వివాదం సద్దుమణగడం తో మూవీ ని రిలీజ్ చేసారు.
2. సర్కారు వారి పాట
ఈ మూవీ సెకండ్ హాఫ్ లో మహేష్ కీర్తి సురేష్ ని బ్లాక్ మెయిల్ చేసి.. తన పక్కన పడుకోమని అడుగుతాడు. అప్పుడు ఆమెపై కాలు కూడా వేస్తాడు. ఈ సన్నివేశం పై పలు వివాదాలు రావడం తో డైరెక్టర్ పరశురామ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు కానీ.. అవి ఫలించలేదు.
3. రంగస్థలం
పెద్ద సినిమాలు వస్తున్నాయంటే చాలు ఏదో వివాదం రాచుకునే ఉంటుంది..రామ్ చరణ్ , సమంత జంటగా నటించిన రంగస్థలం ఫై కూడా ఓ వివాదం మొదలు అయ్యింది. సినిమాలోని రంగమ్మ మంగమ్మ అనే ఎంత పాపులర్ అయ్యిందో తెలియంది కాదు..ఎక్కడ చూసిన ఈ పాట మారుమోగిపోతుంది. అయితే ఈ పాటలో ‘గొల్లభామ వచ్చి గోళ్ళు గిల్లుతుంటే’ అనే పదాలు తమ జాతి ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయని యాదవ సంఘం డిమాండ్ చేశారు. ఆ పదం తోలగించి సినిమా విడుదల చేయడం జరిగింది.
4. ‘మర్డర్’
రామ్ గోపాల్ వర్మ నిర్మించిన చిత్రంలో మర్డర్ ఒకటి ఈ సినిమా తెలంగాణలో జరిగిన పరువు హత్య గురించి తీసిన ఈ సినిమా వివాదస్పదం అయింది. ఈ కేసు కోర్టులో ఉండగా వర్మ ఈ సినిమా తీశాడు.. ఈ మూవీలో చివరగా పిల్లల్నీ కనగలం కానీ.. వారి మనస్తత్వాలను కనగలమా అంటూ ఎండ్ చేశాడు వర్మ. ఇక ఈ సినిమాపై ప్రణయ్ తండ్రి కోర్టులో ఓ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆర్జీవీ ‘మర్డర్’ సినిమా వల్ల కోర్టులో నడుస్తున్న కేసుపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ అమృత మామయ్య బాలాస్వామి కోర్టులో కేసు వేశారు. ఈ చిత్రం కూడా ఆర్ జి వి వరల్డ్ థియేటర్ లో విడుదలైంది.
5. దరువు
రవితేజ సినిమాకి టైటిల్ వివాదాస్పదమైంది. దరువు అనేది తమ సంస్కృతిలో భాగమని తెలంగాణ సంస్కృతి సంఘం వ్యతిరేకించింది. చివరకు వారిని నిర్మాత ఒప్పించి సినిమాని రిలీజ్ చేసుకున్నారు.
6. రచ్చ
రామ్ చరణ్ రచ్చ సినిమాలోని ‘వాన వాన వెల్లువాయే’ పాటలో గౌతమ్ బుద్ధ విగ్రహం ముందు చిత్రీకరించారని మహిళా సంఘాలు రచ్చ చేశాయి. అందుకే ఆ పాటలో బుద్ధుడు కనబడకుండా రీ ఎడిట్ చేసి సినిమాని రిలీజ్ చేశారు.
7. దువ్వాడ జగన్నాథం
మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం డీజే. అప్పట్లో ఈ మూవీ పై ఎన్నో వివాదాలు వచ్చాయి. ఈ మూవీ లో ఒక సీన్ లో అల్లు అర్జున్ గాయత్రీ మంత్రం జపిస్తూ విలన్స్ తో ఫైట్ చేస్తాడు. ఆ టైం లో అల్లు అర్జున్ కాళ్ళకి చెప్పులు ఉండటం పై పలు అభ్యంతరాలు వచ్చాయి.
8. బెజవాడ
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో నాగ చైతన్య హీరోగా వచ్చిన చిత్రం బెజవాడ. ఈ మూవీ కి మొదట బెజవాడ రౌడీలు అనే పేరు పెట్టారు. దీనిపై ఆ ప్రాంత ప్రజలు అభ్యంతరం తెలపడం తో టైటిల్ లో రౌడీలు అనే పదాన్ని తొలగించారు.
9. కృష్ణం వందే జగద్గురుమ్
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ లో రానా హీరో గా నటించారు. ఈ మూవీ మొత్తం బళ్లారి మైనింగ్ చుట్టూనే తిరుగుతుంది. ఒక ప్రముఖ పార్టీ లీడర్ ని ఈ మూవీ లోని మాఫియా లీడర్ రెడ్డప్ప లాగా చూపించారు అని పొలిటికల్ పార్టీస్ చాలా గొడవ చేసాయి.
10. కెమెరా మాన్ గంగ తో రాంబాబు
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, పవర్ స్టార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం లో కొన్ని రాజకీయ పార్టీలను ఉద్దేశించిన డైలాగ్స్ ఉన్నాయంటూ కొందరు వివాదం సృష్టించారు. కానీ ఈ మూవీ అలాగే రిలీజ్ అయ్యింది.
11. మగధీర
ఏం పిల్లాడో వెళదాం వస్తావా అనే విప్లవ గీతాన్ని .. విరహ గీతానికి వాడారని.. అది కూడా రచయిత వంగపండు ప్రసాద్ రావు అనుమతి లేకుండా పాట తీసుకున్నారని పెద్ద గొడవ జరిగింది. చివరికి అతనికి నచ్చచెప్పడంతో వివాదం ముగిసింది. విజయం వరించింది.
11. అర్జున్ రెడ్డి
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ని స్టార్ హీరో గా మార్చింది ఈ మూవీ. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ మూవీ లో అభ్యంతరకరమైన సీన్స్ ఎక్కువగా ఉన్నాయి అని కొందరు రాజకీయ నాయకులు సినిమా పోస్టర్లను చించేశారు కూడా. కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
12. అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు
ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా ఇది. ఈ సినిమాపై టీవీలలో డిబేట్ లు, గొడవలు, పేరు మార్చడం ఇలా చాలా గొడవలు జరిగాయి.
13. లక్ష్మిస్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ బయోపిక్ కు ధీటుగా ఈ సినిమాను తీసి తన పంతం ను నెగ్గించుకున్నారు వర్మ. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎలా వచ్చారు అనేది ఈ మూవీ లో చూపించాడు.
14. కింగ్
ఈ మూవీ లో బ్రహ్మానందం, నాగార్జున మధ్య వచ్చే సీన్ ని చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఆపాదిస్తూ అనేక ట్రోల్స్ రావడం తో ఈ సీన్ బాగా వివాదాస్పదం అయ్యింది.
15. దేనికైనా రెడీ
మంచు విష్ణు మూవీ దేనికైనా రెడీ లో బ్రాహ్మణులను హేళన చేశారని కొంతమంది గొడవ చేశారు. ఈ వివాదం చాలా వరకు కొనసాగింది. ఈ మూవీ హిట్ అయినా ఈ గొడవ వల్ల చెడ్డపేరు తెచ్చుకుంది.
16. 1 నేనొక్కడినే
ఈ మూవీ లో హీరోయిన్ మహేష్ బాబు వెంట పడుతూ సాంగ్ పడుతుంది. ఆ సాంగ్ కి సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేసారు మేకర్స్. ఆ పోస్టర్ మహిళలను కించపరిచేలా ఉందంటూ హీరోయిన్ సమంత సోషల్ మీడియా లో స్పందించడం తో మహేష్ ఫాన్స్ ఆమె పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తరువాత ఆ క్లిప్ ని సాంగ్ లో తొలగించారు.
17. ఆగడు
మహేష్ బాబు హీరో గా శ్రీను వైటల్ దర్శకత్వం లో వచ్చింది ఆగడు మూవీ. ఈ మూవీ లో విలన్ గా ఫస్ట్ ప్రకాష్ రాజ్ ని అనుకున్నారు. కొంత షూటింగ్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూ లో ప్రకాష్ రాజ్ చెప్పిన మాటలని శ్రీను వైట్ల ఆగడు మూవీ లో పెట్టడం తో పెద్ద దుమారమే చెలరేగింది. ఆ తర్వాత ఆ విషయం సద్దుమణిగింది.
18. గద్దలకొండ గణేష్
ఈ మూవీ కి మొదట హీరో పాత్రని బట్టి వాల్మీకి అనే పేరుని పెట్టారు. కానీ దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడం తో.. మూవీ రిలీజ్ కి ఒకరోజు ముందు కోర్ట్ స్టే ఇచ్చింది. దీంతో ఆ తక్కువ సమయం లోనే మూవీ పేరు ని మార్చి రిలీజ్ చేయగా.. సూపర్ హిట్ అయ్యింది.
ఈ జాబితాలో మేము మిస్ అయిన వివాదాస్పద (Tollywood) సినిమాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.. యాడ్ చేస్తాం..