Sai Dharam Tej: గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నిజానికి తేజు మొదటి చిత్రం ‘రేయ్’ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ ఇతని మొదటి సినిమాగా రిలీజ్ కాలేదు. రెండో సినిమాగా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఫలితాన్ని ఎవ్వరూ అంత సీరియస్ గా పట్టించుకుంది లేదు. అయితే అటు తర్వాత సాయి ధరమ్ తేజ్ చేసిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ‘సుప్రీమ్’ వంటి చిత్రాలు ఇతని మార్కెట్ ను పెంచాయి. కానీ అటు తర్వాత 6 ప్లాప్ లు ఫేస్ చేశాడు తేజు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి వరుసగా హ్యాట్రిక్ హిట్లు అందుకున్నాడు.

అయితే 2021 వినాయక చవితి పండుగ రోజు నాడు సాయి ధరమ్ తేజ్ కు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. దాని వల్ల అతనికి మేజర్ సర్జరీ అవ్వడం.. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమవ్వడం జరిగింది. అయితే తిరిగి కోలుకున్నాక ‘విరూపాక్ష’ అనే మూవీలో నటించాడు. అది ఏప్రిల్ 21న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ‘సాయి ధరమ్ తేజ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది?’ అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) తిక్క :

సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సాయి ధరమ్ తేజ్ కెరీర్లో మొదటి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. రూ.16.76 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.4.88 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

2) విన్నర్ :

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ను సాధించింది కానీ నెగిటివ్ టాక్ వల్ల బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. రూ.27 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్లో కేవలం రూ.16 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

3) నక్షత్రం :

సాయి ధరమ్ తేజ్ ఓ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద రూ.4.27 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

4) జవాన్ :

సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) హీరోగా బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద రూ.10.20 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

5) ఇంటిలిజెంట్ :

సాయి ధరమ్ తేజ్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.27 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.3.65 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

6) తేజ్ ఐ లవ్ యు :

సాయి ధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.4.1 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. డిజాస్టర్ గా మిగిలింది.

7) చిత్రలహరి :

సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.13 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫైనల్ గా రూ.15 కోట్ల షేర్ ను రాబట్టి హిట్ అనిపించుకుంది.

8) ప్రతిరోజూ పండగే :

సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫైనల్ గా ఏకంగా రూ.34 కోట్ల షేర్ ను రాబట్టి.. పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

9) సోలో బ్రతుకే సో బెటర్ :

సాయి ధరమ్ తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.9.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫైనల్ గా రూ.12.6 కోట్ల షేర్ ను రాబట్టి హిట్ అనిపించుకుంది.

10) రిపబ్లిక్ :

సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.13.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.7.19 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus