Aamani, Soundarya: దివంగత నటి సౌందర్య పై ఆమని కామెంట్స్!

  • July 18, 2022 / 10:56 AM IST

తెలుగు సినీ ప్రేక్షకులు నటి సౌందర్యని అంత సులువుగా మర్చిపోలేరు. మహానటి సావిత్రి తరువాత అంతటి పేరు సంపాదించింది సౌందర్య అనే చెప్పాలి. గ్లామర్ షోకి దూరంగా ఉన్నప్పటికీ.. నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించగలిగింది. కానీ 31 ఏళ్లకే హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించింది. ఆమె చనిపోయి పదిహేడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ప్రేక్షకులు ఆమెని మర్చిపోలేదు. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఓ పక్క రమ్యకృష్ణ, రోజా లాంటి స్టార్ హీరోయిన్లు గ్లామర్ షోతో గట్టి పోటీ ఇచ్చినా.. సౌందర్య మాత్రం చీరకట్టుతోనే తెలుగు వారికి దగ్గరైంది.

ఒక్క టాలీవుడ్ లో మాత్రమే కాకుండా.. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో హీరోయిన్ గా సినిమాలు చేసింది. తన కెరీర్ లో సౌందర్య గ్లామర్ షో చేయకపోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది నటి ఆమని. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో ఆమని హీరో తల్లి పాత్రలో నటించింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో సౌందర్యతో తనకున్న అనుబంధం, స్నేహం గురించి చెప్పుకొచ్చింది.

ఆమె ఎందుకు ఎక్స్‌పోజ్ చేయలేదనే విషయంపై ఆమని క్లారిటీ ఇచ్చింది. ఒకసారి సౌందర్యతో షూటింగ్ లో ఉన్నప్పుడు.. నువ్వెందుకు ఎక్స్‌పోజ్ చేయవని ఆమని ఆమెని ప్రశ్నించిందట. దానికి సౌందర్య.. ”ఎందుకు చేయాలి..? రేపు పెళ్లై భర్త పక్కనే ఉన్నపుడు మన సినిమాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది..? మన ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది? డబ్బుల కోసం ఇలా చేస్తే రేపు ఎలా..?” అని తిరిగి తననే ప్రశ్నించిందట. కొన్ని నియమాలు పెట్టుకొని సౌందర్య ఎక్స్‌పోజింగ్‌ కి దూరంగా ఉందని.. అందులో తప్పు లేదని ఆమని వెల్లడించింది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus