సావిత్రిగారి తరువాత ఆ స్థాయిలో నటిగా మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ సౌందర్య అనే చెప్పాలి.అందరి హీరోయిన్లలా గ్లామర్ పాత్రలకే పరిమితమవ్వకుండా.. తన పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలనే ఎంపిక చేసుకునేది. నెంబర్ వన్ హీరోయిన్ గా రాణిస్తున్నప్పటికీ… చిన్న హీరోల సినిమాల్లో నటించడానికి ఏమాత్రం నామోషీగా ఫీలయ్యేది కాదు. బాబు మోహన్, అలీ వంటి కమెడియన్ల సరసన కూడా స్పెషల్ సాంగ్స్ చేసింది అంటే ఆమె ఎంత ఒదిగి ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈమె 31 ఏళ్లకే ఎవ్వరూ ఊహించని విధంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆమె అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి నెట్టేసింది.
పదిహేడేళ్లు అవుతున్నా..ఆ సంఘటనను ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు. ఇదిలా ఉండగా.. టాలీవుడ్లో సౌందర్యకు అత్యంత సన్నిహితురాలు అయిన హీరోయిన్ ఆమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె గురించి కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఆమని మాట్లాడుతూ.. “సౌందర్యకు నాకు మంచి స్నేహం ఉంది. ఆమె నాతో ప్రతీ విషయాన్ని షేర్ చేసుకునేది. సౌందర్యకి తన నాన్న గారు అంటే చాలా ఇష్టం. ఆయన మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పేది కాదు.
అంతలా తన తండ్రిని ప్రేమించి అతని మాటకు విలువిచ్చేది. సౌందర్య అమ్మగారు కూడా చాలా మంచావిడ. నేను ఎప్పుడు వాళ్ళింటికి వెళ్లినా నన్ను చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. వాళ్ళకి బెంగళూరులో సొంత ఇల్లు ఉండేది. ఇప్పుడది మరీ బూత్ బంగ్లా గా మారిపోయింది. మొన్నామధ్య వెళ్ళినప్పుడు చూశాను అసలు ఎవ్వరూ కూడా దానిని పట్టించుకోవట్లేదు” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది ఆమని.
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!