కూరగాయల బదులు వేలు కట్ చేసుకున్న హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియో..

సోషల్ మీడియాలో హీరోయిన్లకు సంబంధించి ఏ చిన్న న్యూస్ కానీ లేటెస్ట్ పిక్స్, రీల్స్ కానీ వచ్చాయంటే చాలు.. క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అందాల భామలను మిలియన్ల కొద్దీ ఫాలో అవుతుంటారు.. ఈ ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా కథానాయికలు సామాజిక మాధ్యమాలలో హంగామా చేశారు.. రీసెంట్‌గా మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ వెజిటబుల్స్ కట్ చేస్తుండగా.. అలవాటు లేని పని కావడంతో వేలు కట్ చేసుకుంది..

క్యాప్సికమ్ కోస్తుండగా వేలు కట్ అయ్యేసరికి విలవిల్లాడిపోయింది. నేను కిచెన్‌లోకి వెళ్లడానికి పనికి రాను అనడానికిది సంకేతమనుకుంటా అంటూ వీడియో షేర్ చేసింది. ‘‘అడిగితే కోసిచ్చే వాళ్లం కదా.. ఎందుకలా బాధ పడతావ్’’ అంటూ కుర్రకారు కేరింగ్ కామెంట్స్ చేస్తున్నారు. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నటించిన మాళవిక.. ప్రభాస్ – మారుతి కాంబోలో వస్తున్న ‘డీలక్స్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది.. ఇన్‌స్టాలో 1.6 మిలియన్ల మంది పాపను ఫాలో చేస్తున్నారు..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus