టాలీవుడ్/కోలీవుడ్ కుర్ర నాయిక రక్షిత (ఆనంది) వివాహ బంధంతో శ్రీమతిగా మారింది. కోలీవుడ్‌లో కో డైరెక్టర్‌ను ఇటీవల సొంతూరు వివాహం చేసుకుంది. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ‘ఈ రోజుల్లో’తో టాలీవుడ్‌కి పరిచయమైన రక్షిత ఆ తర్వాత ‘బస్ స్టాప్2, ‘ప్రియతమా నీవచట కుశలమా’ తదితర చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో తమిళ చిత్రపరిశ్రమకు తరలిపోయింది. అక్కడ విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకుంటోంది. ఇటీవల ‘జాంబిరెడ్డి’లో ఓ నాయికగా నటించింది.
తమిళంలోకి వెళ్లాక తన పేరును ఆనందిగా మార్చుకుంది రక్షిత. అక్కడ కో డైరెక్టర్ గా పనిచేస్తున్న సోక్రటీస్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది రక్షిత. అయితే ఇది ప్రేమ వివాహం కాదని, పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది. రక్షిత సొంతూరు వరంగల్‌లో గురువారం ఈ వివాహం జరిగింది. కొద్దిమంది స్నేహితులు, బంధువుల సమక్షంలో ఈ వివాహం జరిగిందని సమాచారం.
1
2
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!