2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!

కరోనా టైమ్ లో తెలుగు ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్స్ ని ఎక్కువ మందిని చూసే స్కోప్ లేకపోయినా, ఓటీటీల పుణ్యమా అని కొంతమంది దర్శకులకి మంచి పేరు వచ్చింది. వారిలో కొంతమందిని మనం చూసినట్లయితే,,

1. విశ్వక్ సేన్ హీరోగా హిట్ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్న దర్శకుడు శైలేష్ కొలనుకి మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. నాని నిర్మాతగా వచ్చిన ఈ సినిమా బాక్సీఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది.

2. కలర్ ఫోటో సినిమాతో ఓటీటీలో సంచలనం రేపిన డైరెక్టర్ సందీప్ రాజ్. ఛాయ్ బిస్కెట్ ఫేమ్ సుహాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఆహా లో రిలీజై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. సెలబ్రిటీలు, ఇండస్ట్రీలో దిగ్గజాలు సైతం ఈ సినిమాని మెచ్చుకున్నారు. దీంతో డైరెక్టర్ సందీప్ రాజ్ కి మంచి పేరు వచ్చిందనే చెప్పాలి.

3. ఆహా యాప్ లో నవీన్ చంద్ర హీరోగా చిన్న సినిమాగా వచ్చిన భానుమతీ రామకృష్ణ కూడా మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. శ్రీకాంత్ నాగోతికి ఈ సినిమా మంచి పేరుని తీసుకుని వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో శ్రీకాంత్ కి పలు ఆఫర్లు వచ్చాయి కూడా. నవీన్ చంద్రలోని మరో కోణాన్ని చూపించాడు దర్శకుడు శ్రీకాంత్.

4. మిడిల్ క్లాస్ మెలోడీస్ తో మంచి టాక్ ని సొంతం చేసుకున్నాడు హీరో ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాకి కూడా ఓటీటీలో మంచి వ్యూస్ వచ్చాయి అంతేకాదు, ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వినోద్ అనంతోజుకి కూడా మంచి పేరు వచ్చింది. చాలా నేచరల్ గా స్క్రీన్ ప్లే ఉండటం, మంచి కామెడీ సెన్స్ తో సినిమా ఉండటంతో అందర్నీ ఆకట్టుకున్నాడు డైరెక్టర్ వినోద్.

5. ఎట్టకేలకి థియేటర్స్ తీసిన తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సాయిధరమ్ తేజ్ ముందుకొచ్చాడు. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన సుబ్బుకి కూడా ఇది ఫస్ట్ సినిమానే. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత మంచి కలక్షన్స్ తో సినిమా దూసుకెళ్తోంది. దీంతో సుబ్బుకి కూడా తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ కనిపిస్తోందనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus