సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!

కొత్త సంవత్సరం వస్తుంది అంటే.. కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలతో ముందుకు సాగాలి అని ప్రతీ ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు. 2020వ సంవత్సరాన్ని కూడా అదే విధంగా మొదలు పెట్టాము కానీ.. ఆ సంవత్సరం రకరకాల అనుభవాలను మిగిల్చి వెళ్ళింది. కరోనా వైరస్ వలన లాక్ డౌన్ ఏర్పడడం.. మనకు తెలియకుండానే 6నెలలు మాయమైపోవడం జరిగింది. ఆ తరువాత అయినా కుదురుగా ఉండనిచ్చిందా అంటే ఎన్నో ప్రకృతి వైపరిత్యాలు సంభవించాయి. దాదాపు అన్ని పరిశ్రమలను 2020.. కోలుకోలేని దెబ్బ కొట్టింది. ముఖ్యంగా మన సినీ పరిశ్రమను .. పెద్ద దెబ్బె కొట్టింది. షూటింగ్ లు ఆగిపోవడం, థియేటర్లు మూతపడడం, మరికొందరు లెజెండరీ సెలబ్రిటీలు కన్నుముయ్యడం వంటి విషాదాలు ఎన్నో చోటుచేసుకున్నాయి. ఇవన్నీ సోషల్ మీడియాలో ఏ రేంజ్లో ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి 2020 లో భారీ ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన టాప్ 10 వార్తలు ఏంటో హైలెట్స్ గా చూద్దాం రండి :

1) సోనూసూద్ గొప్ప పనులు :

లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది వలస కూలీలు తమ గమ్య స్థలాలకు చేరుకోలేక అలాగే తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతుంటే.. వారిని చేరదీసి ఆదరించి, అన్నం పెట్టాడు సోనూసూద్. అంతేకాదు వారి కుటుంబసభ్యులను చేరుకునే విధంగా రవాణా సౌకర్యాలను కూడా కల్పించి వారికి మార్గాన్ని చూపించాడు. దీంతో సోషల్ మీడియాలో రియల్ హీరో అంటే సోనూ సూదే అనే విధంగా హైలెట్ అయ్యాడు. అంతేకాదు రైతులకు అండగా నిలబడ్డాడు ఎంతో మందికి ఉద్యోగాలు కూడా ఇప్పించాడు.

2) సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ :

కరోనా ఎంట్రీ ఇస్తున్న టైంలో మహేష్ బాబు, చిరంజీవి, ఎన్టీఆర్, చరణ్ వంటి హీరోలు చేతులను శుభ్రం చేసుకుని .. కోవిడ్ భారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుపుతూ వీడియోలను చేసి వాటిని సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు. ఇవి కూడా పెద్ద ఎత్తున ట్రెండ్ అయ్యాయి..!

3) ప్రభాస్ సినిమాలు :

‘రాధే శ్యామ్’ తో పాటు ప్రభాస్… తన 21వ చిత్రం అలాగే ‘ఆది పురుష్’ ‘సలార్’ వంటి భారీ బడ్జెట్ ప్రాజెక్టులను చేయబోతున్నట్టు అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు. ఇవి కూడా దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి.

4) రజినీకాంత్ పొలిటికల్ లైఫ్ :

తలైవా పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని.. ఆయన కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లో ఎవ్వరూ ఊహించని అద్భుతాలు చేస్తారని అంతా అనుకున్నారు. ఈ అంశం కూడా తెగ ట్రెండ్ అయ్యింది. కానీ అనారోగ్య పరిస్థితుల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్టు ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేశారు రజినీ.

5) ఆర్.ఆర్.ఆర్ టీజర్లు :

ముందు చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు అది పెద్ద ఎత్తున ట్రెండ్ అయ్యింది. అయితే ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ ఆలస్యం అయ్యిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఫైనల్ గా ఎన్టీఆర్ టీజర్ విడుదలవ్వడం అది కూడా దేశవ్యాప్తంగా ట్రెండ్ అవ్వడం జరిగింది.

6) పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ :

పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చెయ్యడు అని నిరాశపడిన అభిమానులకు.. ‘వకీల్ సాబ్’ సినిమా పూజాకార్యక్రమాలు మంచి ఊపిచ్చాయి. ఆ తరువాత వరుస సినిమాలు చెయ్యడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఇండియా మొత్తం ట్రెండ్ అయ్యింది.

7) నిఖిల్ టు నిహారిక పెళ్లిళ్లు :

కరోనా సీజన్ వస్తేనే కానీ పెళ్లి చేసుకోవడానికి టైం దొరకలేదు మన టాలీవుడ్ సెలబ్రిటీలకి. నిఖిల్, నితిన్, రానా, కాజల్, నిహారిక.. వీళ్ళ పెళ్లి వార్తలు,ఫోటోలు పెద్ద ఎత్తున ట్రెండ్ అయ్యాయి.

8) ఎస్.పి.బాలు మరణించడం :

లెజెండరీ సింగర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మరణించడం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను విషాదానికి నెట్టేసినట్టు అయ్యింది. కరోనా భారిన పడ్డ ఈ గాన గంధర్వుడు కోలుకోవాలని.. ప్రార్ధించని ప్రేక్షకులు, సెలబ్రిటీలు లేరు. ఈ వార్తలు కూడా పెద్ద ఎత్తున ట్రెండ్ అయ్యాయి.

9) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ :

ఎం.పి.సంతోష్ కుమార్ నెలకొల్పిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ స్వీకరించి దీనిని విజయవంతం చేసారు. ఇది కూడా పెద్ద ఎత్తున ట్రెండ్ అయ్యింది.

10) రాజమౌళి కరోనా భారిన పడటం :

‘బాహుబలి’ (సిరీస్) తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి కరోనా భారిన పడటంతో ఆ వార్త దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. అయితే త్వరగానే కోలుకున్నారు లెండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus