ఆ టైములో అందరూ అలాంటి కామెంట్సే చేసారు : అంజలి

  • April 2, 2020 / 11:28 AM IST

‘ఫోటో’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది తెలుగమ్మాయి అంజలి. అయితే మొదటి హిట్ అందుకుంది మాత్రం తమిళంలోనే. ‘షాపింగ్ మాల్’ ‘జర్నీ’ వంటి చిత్రాలతో అక్కడ వరుస హిట్ లు అందుకుంది. అవే చిత్రాల్ని తెలుగులో కూడా డబ్ చేయగా ఇక్కడ కూడా హిట్లవ్వడం… ఈమె నటనకు కూడా మంచి పేరు రావడంతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి బడా మల్టీ స్టారర్ సినిమాలో టైటిల్ రోల్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది.

ఈ చిత్రంలో ఈమె నటనకి మంచి పేరు రావడంతో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అయితే ఇప్పుడు కుర్ర హీరోయిన్లు ఎక్కువమంది ఎంట్రీ ఇవ్వడంతో ఈమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో ఈమె పనైపోయింది అనే కామెంట్స్ ఊపందుకున్నాయి. ఈ కామెంట్స్ పై అంజలి స్పందిస్తూ…”కెరీర్ పరంగా ప్రతీ ఒక్కరికి ఎత్తుపల్లాలు ఉండటం సహజం. అవకాశాల కోసం నేను ఎప్పుడూ అంతగా ఎదురుచూడలేదు .. రాలేదని బాధపడనూ లేదు.

కానీ మొన్నామధ్య మా కుటుంబంలో జరిగిన గొడవలు అందరి నోళ్లలోను నానాయి. ఆ సమస్యల కారణంగా నేను బాధపడుతున్నప్పుడు నన్ను ఓదార్చినవారు చాలా తక్కువమంది. నాకు సన్నిహితులుగా వున్నవారే నా గురించి హేళనగా మాట్లాడటం నాకు బాధను కలిగించింది. ఇప్పటికీ ఆ మాటలు నా మనసును గాయపరుస్తూనే ఉంటాయి. ఇక ఇప్పటికీ నా పనైపోయింది అనే కామెంట్లు చేసే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు” అంటూ బాధ పడింది అంజలి.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus